'దేవర' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం దేవర. పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటించగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. తదితరులు నటించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఈనెలలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు ముందు కొరటాల శివ ఆచార్య సినిమా తీశారు. అది బ్లాక్ బస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనేనేను లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన శివ ఆచార్య లాంటి ఫ్లాప్ ఇస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు.
అధికారికంగా పోస్టర్ కూడా విడుదల చేశారు
వాస్తవానికి దేవర సినిమాకు ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదు. అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో ఓ చిత్రం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. బన్నీ 21వ సినిమాగా 2020లోనే ప్రకటన వచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే కథ, స్క్రీన్ ప్లే అంతా సిద్ధమైన తర్వాత బన్నీకి ఎక్కడో, ఏదో తేడా రావడంతో సినిమా చేయనని చెప్పేశాడు. దీంతో సినిమా ఆగిపోయింది. నిర్మాత కూడా ఇప్పుడు ఈ సినిమాను తీసిన నిర్మాతల్లో ఒకరైన మిక్కిలినేని సుధాకరే.

అల్లు అర్జున్ కు నచ్చని పాయింట్ ఎన్టీఆర్ కు నచ్చిందా?
ప్రస్తుతం సుధాకర్, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. అల్లు అర్జున్ కు నచ్చని పాయింట్ ఎన్టీఆర్ కు ఎక్కడ నచ్చింది? సినిమా విడుదలై హిట్ అయితే అల్లు అర్జున్ వదులుకొని తప్పు చేశాడా? లేదంటే సినిమా ఫ్లాప్ అయితే అల్లు అర్జున్ వద్దనుకొని మంచి పని చేశాడా? అనేది తేలుతుంది.
లేదంటే ఈ సినిమాను ఒప్పుకొని తారక్ తప్పు చేశాడా? ఒప్పు చేశాడా? అనేది కూడా తేలుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సినిమాకు తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీలో భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. పాన్ ఇండియా హీరోగా తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఎంతవరకు విజయవంతమవుతారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications