Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

త్రిష ఇంట్లో తెలుగు స్టార్ హీరో

తెలుగు సినిమా అన్నా, తమిళ సినిమా అన్నా, మళయాళ సినిమా అన్నా, కన్నడ సినిమా అన్నా.. ఇలా దక్షిణాదిలో ఏ భాషకు సంబంధించిన సినిమా అన్నా అది మద్రాసులోనే షూటింగ్ జరుపుకునేది. ఆరోజుల్లో సౌకర్యాలన్నీ అక్కడే ఉండేవి. మద్రాసీ అనే పేరు నుంచి బయటపడేందుకు వివిధ భాషలకు చెందిన పరిశ్రమలు తమ స్వరాష్ట్రానికి తరలిపోయి అభివృద్ధి చెందాయి. అయినప్పటికీ కొందరు నటులు మాత్రం ఇప్పటికీ చెన్నైలోనే ఉంటుంటారు. వారికి ఆ నగరంతో అలా విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయివుంటుంది. అటువంటివారిలో తెలుగులో స్టార్ హీరోగా కొనసాగిన సీనియర్ హీరో భానుచందర్ ఒకరు.

భానుచందర్ కు ఇద్దరు కుమారులు
యాక్షన్ చిత్రాల్లో నటించి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న భానుచందర్ ప్రస్తుతం చెన్నైలో తన సొంత ఇంట్లో నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు రెండు తెలుగు సినిమాల్లో నటించారు. రెండో కుమారుడు వైద్యుడిగా పనిచేస్తున్నారు. అయితే ఆ ఇల్లు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిషది. పరిశ్రమకు వచ్చిన మొదట్లో తన ఆదాయంతో ఆ ఇంటిని కొనుగోలు చేసిన త్రిష అందులోనే కొంతకాలం నివసించారు. తర్వాత వేరే ఇంటికి మారే క్రమంలో దీన్ని భానుచందర్ కు విక్రయించారు. ఆ ఇంటిని ఆయన ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవడమేకాదు.. ఇంటిచుట్టూ పచ్చటిచెట్లు పెట్టి పచ్చదనంతో ఇంటిని నింపేశారు.

telugu star hero bhanuchandar purchase heroine trisha house in chennai

హాల్లో మినీ బార్
భానుచందర్ ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్ లో మినీ బార్ కనపడుతుంది. విచిత్రం ఏమిటంటే ఆయన మందు మానేసి 20 సంవత్సరాలవుతోంది. అయినప్పటికీ డెకరేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో హాల్లో మినీ బార్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంటిచుట్టూ ఉన్న పచ్చదనం మొత్తం తన భార్య చలవే అని, ఆమెకు మొక్కలంటే ఎంతో ప్రాణమని, వాటిని ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తుంటుందని చెప్పారు. ఎప్పుడన్నా త్రిష కనపడితే తన ఇల్లు ఎలా ఉందని అడుగుతుందని, తాను బెడ్ రూమ్ గా ఉపయోగించుకున్న గది ఇప్పుడు తన బెడ్ రూమ్ గా మారిందన్నారు. ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తుంటారని అడిగిన ప్రశ్నకు సంగీతాన్ని ఆస్వాదిస్తుంటానని, కీబోర్డు ప్లే చేయడంతోపాటు గిటార్ వాయిస్తుంటానని భానుచందర్ వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+