'డాకూ మహారాజ్' వదులుకున్న స్టార్ హీరో... బ్యాడ్‌లక్!

నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా, కొల్లి బాబీ దర్శకత్వంలో వచ్చిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకూ మహారాజ్ వసూళ్ల పరంగా దుమ్ము దులిపేస్తోంది. ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటిరోజు మొదటి ఆట నుంచి హిట్ టాక్ ను సంపాదించుకుకొని దూసుకుపోతోంది. నాలుగు రోజులు గడిచిన తర్వాత కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో, సీడెడ్ లో అర్థరాత్రి వేళ కూడా అదనంగా షోలు వేస్తున్నారంటే దీనికి వచ్చిన మంచి క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. బాలయ్య వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి ఈ సినిమాతో రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి ముందు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించారు.

రూ.200 కోట్ల దిశగా దూసుకుపోతోంది
మూడు రోజులకే రూ.92 కోట్లు వసూలు చేసి రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. బాలయ్య యాక్షన్ అందరికీ నచ్చింది. బాలకృష్ణను బాబీ ఎంతో స్టైలిష్ గా ఈ సినిమాలో చూపించారు. వాస్తవానికి ఈ సినిమాను ముందుగా చేయాల్సిన హీరో రవితేజ. రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాతో బాబీ దర్శకుడిగా మారారు. ఆ సమయంలో డాకూ మహారాజ్ కథ చెప్పారు. తర్వాత క్రాక్ సినిమా సమయంలోను ఈ కథను రవితేజకు వినిపించగా, ఇలాంటి కథతో ఇంతకుముందు నేను కిక్ 2 చేశాను.. అది సరిగా ఆడలేదు.. ఇప్పుడు తిరిగి చేస్తే ఆడుతుందంటావా? అని బాబీని ప్రశ్నించారు. ఆ సినిమాకు, ఈ సినిమాకు పోలిక రాకుండా చూసుకునే బాధ్యత తనదని, కమర్షియల్ గా ఈ సినిమా చాలా భారీస్థాయిలో ఉంటుందని బాబీ రవితేజకు చెప్పారు.

telugu star hero missed the daaku maharaaj movie

ఆ సినిమా పూర్తయిన తర్వాత చూద్దాంలే
ఆ సమయంలో రవితేజ నాలుగు సినిమాలు చేస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత చూద్దాం అన్నారు. తర్వాత చిరంజీవితో వాల్తేరు వీరయ్య చేయడం, ఆ తర్వాత బాలయ్య భగవంత్ కేసరి తర్వాత దర్శకుడు బాబీతో సినిమా చేయడానికి ఓకే అన్నారు. దీంతో బాబీ డాకూ మహారాజ్ కథ వినిపించగా నచ్చడంతో వెంటనే సినిమా మొదలుపెట్టి, విడుదలచేసి భారీ హిట్ కొట్టారు. వరుసగా ఫ్లాప్ సినిమాలతో కెరీర్ డైలామాలో పడే పరిస్థితికి వచ్చిన రవితేజకు ఈ సినిమా చేసివుంటే కచ్చితంగా ఎంతో సహాయపడేది. మంచి హిట్ కొట్టి నిలదొక్కుకునేవాడు. కానీ దురదృష్టం వెక్కిరించడంతో సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. రవితేజ చేస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో బజ్ రావడంలేదు. వరుసగా అన్నీ ఫ్లాప్స్ కావడంతో ఎవరూ ఆసక్తి చూపడంలేదు. రూ.100 కోట్లు అలవోకగా రాబట్టగలిగే సత్తా ఉన్న హీరో రవితేజ చెత్త కథలను ఎంచుకొని, చెత్త సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+