ఒక్కమాటతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకుల్లో అందరికంటే ముందంజలో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. వరుసగా మూడు హిట్లు కొట్టి మంచి జోరుమీదున్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది విజయదశమికి ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగు సాహిత్యం, సాంప్రదాయాలను ఎక్కువగా ఇష్టపడే బాలకృష్ణ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ఒక ప్రకటన కూడా విడదుల చేశారు.
క్రోధి నామ సంవత్సరం సందర్భంగా ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సంతోషాన్ని కలిగించాలని, ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంతో జీవించాలని కోరారు. కోరికలు నెరవేరాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మన పండగలు, తెలుగు సాంప్రదాయాలు ఆచార సంస్కృతితో అనుసంధానమై ఉండాలన్నారు. తెలుగువారిచే వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి సాధించాలన్నారు. అందరి జీవితం వసంత రుతువులా చిగురించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. బాలయ్య ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. ఈ ఒక్క విషెస్ తో సోషల్ మీడియాను బాలకృష్ణ షేక్ చేస్తున్నాడని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.

అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బాలయ్య ఈ సారి కచ్చితంగా విజయం సాధించి హ్యాట్రిక్ కొడతానని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. బాబీ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 చేస్తున్నారు. దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications