రవితేజ ఎన్ని రూ.కోట్లు సంపాదించాడో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రవితేజ చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ నీకోసం సినిమా ద్వారా సోలో హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాలతో పాపులారిటీని సంపాదించుకోవడమేకాదు తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు. వేగంగా కమర్షియల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను రవితేజ అలరించారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచన్ సినిమాలో నటిస్తున్నారు. కేవీ అనుదీప్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈగల్ సినిమాతో తెలుగు సినీ ప్రియులను పలకరించనున్నారు.యబోతున్నారు రవితేజ. ఇక ఇప్పుడు ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

telugu star hero raviteja property value

కెరీర్ ఆరంభించినప్పుడు అతి తక్కువ పారితోషికం తీసుకున్న రవితేజ క్రాక్ సినిమాకు ముందువరకు రూ.12 కోట్లు తీసుకునేవారు. ఆ తర్వాత రూ.15 కోట్లకు పెంచినట్లు వార్తలు వచ్చాయి. ధమాకా సినిమా హిట్ అయిన తర్వాత రికార్డుస్థాయిలో తన రెమ్యునరేషన్ ను రూ.20 కోట్లకు పెంచారు. తెలుగులో సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునకన్నా ఎక్కువ పారితోషికాన్ని రవితేజ తీసుకుంటున్నారు.

రవితేజ ఆస్తుల విషయానికొస్తే.. రూ .150 కోట్ల నికర విలువ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో రూ.30 కోట్ల విలువచేసే బంగళాలున్నాయి. రూ. 6 కోట్ల విలువైన కార్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలతోపాటు రూ.50 కోట్లకు పైబడిన ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం. వీటిల్లో సగం ఆస్తులు తన భార్యపేరుమీద రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+