‘మిరాయ్’ సినిమాను తిరస్కరించిన స్టార్ హీరో
తేజ సజ్జా ఎంత చక్కగా కథలను ఎంచుకుంటాడు అనేదానికి మిరాయ్ ఒక ఉదాహరణ. హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత మంచి కథ కోసం చాలా సమయం ఎదురుచూశాడు. కంగారుపడి ఏది పడితే ఆ కథను ఎంచుకోలేదు. కచ్చితంగా మరో ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలనే కసి అతనిలో కనిపించింది. అందుకు తగినట్లుగానే చాలాకాలం వేచిచూసిన తర్వాత కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. హనుమాన్ సాధించినట్లే కలెక్షన్లు కూడా రాబడుతోంది. అయితే ఒక స్టార్ హీరో మాత్రం ఈ చిత్రాన్ని కేవలం పారితోషికం నచ్చలేదనే ఉద్దేశంతో వదులుకున్నాడు.
పారితోషికం విషయంలో విభేదాలు
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ కథను మూడు సంవత్సరాల క్రితం రాసుకున్నారు. ముందుగా చాలామంది హీరోలను సంప్రదించాడు. అయితే వారంతా నటించడానికి వెనకాడారు.చివరకు హీరో నానిని సంప్రదించగా అతనికి కూడా బాగా నచ్చింది. అయితే పారితోషికం విషయంలో విభేదాలు రావడంతో సినిమా నుంచి నాని తప్పుకున్నాడు. అప్పుడు తన కథకు సరిపోయే హీరో కోసం కార్తీక్ వెతుకుతుండగా తేజ కనపడ్డాడు. వెంటనే కలిసి కథను వినిపించడంతో తేజకు కూడా బాగా నచ్చింది. వెంటనే అంగీకరించాడు.

వదులుకున్నవారంతా బాధపడుతున్నారు
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ కొట్టింది. చాలాకాలం తర్వాత విశ్వప్రసాద్ కు ఈ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ ను అందించింది. తేజ నటన అద్భుతంగా ఉందని, చాలా అనుభవం ఉన్నవాడిలా నటించాడంటూ సినీ విశ్లేషకులు, విమర్శకులు సైతం ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. విజువల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన నాణ్యతతో కూడిన వీఎఫ్ ఎక్స్ వర్క్ ను దర్శకుడు రాబట్టుకున్నాడు. హనుమాన్ విషయంలో కూడా ఇదే జరిగింది. తేజ సజ్జా, మంచు మనోజ్ పోటీపడి నటించడం, శ్రియ పాత్ర, హీరోయిన్ పాత్ర బాగుండటం, బీజీఎం అదిరిపోయే స్థాయిలో ఉండటంలాంటివన్నీ కలిసిరాగా, ప్రభాస్ అతిథి పాత్రలో మెరవడం అంతకంటే అదిరిపోయింది. మొత్తానికి మిరాయ్ సినిమాను వదులకున్న హీరోలంతా ఇప్పుడు ఎంతో బాధపడుతుంటారు.












Click it and Unblock the Notifications