కత్రినాకైఫ్ దగ్గర రూ.5 కోట్లు అప్పు చేసిన తెలుగు స్టార్ హీరో?
తెలుగు చలనచిత్ర పరిశ్రమద్వారా పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి వరుసగా సూపర్ హిట్లు అందుకొని స్టార్ హీరోయిన్స్ గా ఎదిగినవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో కత్రినా కైఫ్ ఒకరు. తెలుగు లో మల్లీశ్వరి చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుండి అవకాశాలు వరుసగా తలుపుతట్టాయి.
'మల్లీశ్వరి' చిత్రం తర్వాత ఈమె తెలుగు లో నందమూరి బాలకృష్ణతో 'అల్లరి పిడుగు' అనే చిత్రం చేసింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ దక్షిణాది సినిమాల్లో నటించలేదు. బాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ని ఎంజాయ్ చేస్తూ కోట్ల రూపాయిల పారితోషికాన్ని అందుకుంటోంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ క్రేజీ హీరోయిన్ గురించి సోషల్ మీడియా లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దక్షిణాదిలో సినిమాలు తక్కువే చేసినప్పటికీ కొంతమంది స్టార్ హీరోలతో మాత్రం బాగా క్లోజ్ గా ఉండేదట. పార్టీల్లో కూడా కలుస్తుండటంవల్ల పరిచయాలన్నీ మంచి స్నేహంగా మారాయి.

అప్పట్లో ఈ కుర్ర హీరో ఒక సినిమాని నిర్మించాడు. హీరోగా కూడా ఆయనే నటించాడు. దీనికి సంబంధించి రివ్యూలు బాగా వచ్చినప్పటికీ కమర్షియల్ గా సినిమా విజయం సాధించలేదు. ఫైనాన్సర్స్ కి తిరిగి డబ్బులు ఇచ్చేందుకు ఆ సమయం లో ఆ హీరో దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. వరిని అడగాలో తెలియక కత్రినా కైఫ్ ని 5 కోట్ల రూపాయిలు డబ్బులు సర్దమని అడిగాడంట. అడిగిన వెంటనే ఆమె రూ.5 కోట్లు ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఆ కుర్ర హీరో ఐదుకోట్ల రూపాయల్లో ఒక్క రూపాయిని కూడా కత్రినాకు తిరిగివ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications