సమంత సంపాదన ఎలా ఉందో తెలుసా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలకు రోజురోజుకు భారీ క్రేజ్ పెరుగుతోంది అంటే దానికి కారణం వారు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటమే. వారి కుటుంబ విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను, తాను ఎక్కడికి వెళ్లంది? ఏం చేస్తుంది? ఏం చేయాలనుకుంటుంది?.. తదితర వ్యక్తిగత విషయాలను కూడా నేరుగా అభిమానులతో పంచుకుంటుండటమే ప్రధాన కారణం. తాము నటించే సినిమాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. దీనివల్ల అభిమానులతో నేరుగా సంభాషించడమే కాకుండా వారి అభిమానానికి కూడా పాత్రులవుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో దీనివల్ల ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఏవైనా బ్రాండ్స్ ను వారు ప్రమోట్ చేశారంటే ఆయా కంపెనీలకు ఆదాయం కూడా పెరుగుతోంది. అంతేకాదు.. షేర్ చేసే సెలబ్రిటీలకు మంచి ఆదాయం వస్తోంది. ఒక్కోసారి వారికి సినిమాలకన్నా, వెబ్ సిరీస్ లకన్నా ఎక్కువగా వాణిజ్య ప్రకటనలద్వారా, వారు షేర్ చేసే యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఎవరెవరు ఎంతెంత సంపాదిస్తున్నారో తెలుసుకుందాం.

telugu star heroine Samantha earns 50 lakh rupees for one instagram post

రష్మిక
నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ పాన్ ఇండియా హీరోయిన్ అయింది. ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేస్తే రూ.30 లక్షలు తీసుకుంటోంది.

కాజల్ అగర్వాల్
సీనియర్ హీరోయిన్ కాజల్ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఒక పోస్ట్ చేస్తే రూ.40 నుంచి రూ.50 లక్షలు తీసుకుంటోంది.

పూజా హెగ్డే
ఇటీవలికాలంలో పెద్దగా సినిమా అవకాశాలు రావడంలేదు. అయినా సోషల్ మీడియా ఖాతాలద్వారా అభిమానులతో మాట్లాడుతుంటుంది. ఒక పోస్ట్ కు రూ.20 లక్షలు తీసుకుంటోంది.

సమంత
స్టార్ హీరోయిన్ సమంతకు 30 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఒక పోస్ట్ షేర్ చేసినందుకు రూ.50 లక్షలు అందుకుంటోంది.

మహేష్ బాబు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహేష్ బాబు క్రేజ్ వేరే. ఆయన ఏదైనా బ్రాండ్ ప్రమోట్ చేస్తే రూ.2 కోట్లను అందుకుంటారు. తెలుగులో అత్యధిక బ్రాండ్లు ప్రమోట్ చేసే హీరో కూడా ఈయనే.

విజయ్ దేవరకొండ
విజయ్ ఏదైనా పోస్ట్ చేస్తే కోటిరూపాయలు అందుకుంటారు. అలాగే అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, నాగచైతన్య తదితరులు కూడా తమ బ్రాండ్ వాల్యూకు తగినట్లుగా తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+