రజనీకాంత్‌ను ప్రేమించి ఒంటరిగా మిగిలిపోయిన తెలుగు స్టార్ హీరోయిన్
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి భారతదేశంలో ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. బెంగళూరులో ఆర్టీసీ కండక్టర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ సూపర్ స్టార్ ఇప్పుడు దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగారు. తమిళనాడులో అభిమానులు ఆయనకు గుడి కట్టారంటే రజనీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని అర్థమవుతోంది. మహారాష్ట్రలో జన్మించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించి తమిళనాడులో స్థిరపడ్డారు. ఆయన నిజంగా తమిళుడు కాదంటే తమిళులు ఒప్పుకోరు. 74 సంవత్సరాల వయసులో జైలర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారంటే ఆయన స్టామినా అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్ సినిమా విడదలవుతోంది అంటే బెంగళూరులో, తమిళనాడులోని పలు కంపెనీలు తమ సిబ్బందికి సెలవులు ప్రకటించడమేకాదు.. టికెట్లు కూడా తెచ్చిస్తాయి. అలా ఉంటుంది రజనీకాంత్ అంటే.
అభిమానం కాస్తా ప్రేమగా మారింది
రజనీకి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. రజనీకాంత్ సినిమాల్లో బాగా బిజీగా ఉన్న సమయంలో ఓ నటితో ప్రేమలో పడ్డారని, పెళ్లి చేసుకోవడం వీలుపడనప్పటికీ ఆ హీరోయిన్ మాత్రం ఆయనమీద ప్రేమతో పెళ్లిచేసుకోకుండానే మిగిలిపోయింది. ఆమె ఎవరో కాదు.. సిల్క్ స్మిత. తన నటనతోపాటు నృత్యాలతో దక్షిణాది ప్రేక్షకులకు చిరపరిచితమైన సిల్క్ స్మిత 35 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకొని సినీ పరిశ్రమను విషాదంలో ముంచింది. సెలబ్రిటీలకు కూడా సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ పక్కన ఒక్కసారి నటించినా చాలు అనుకుంది సిల్క్ స్మిత. అయితే ఏకంగా ఆయన పక్కన హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ అభిమానం కాస్తా రజనీమీద ప్రేమగా మారింది.

వార్తలన్నీ దుమారం సృష్టించాయి
ఆ సమయంలో రజనీకాంత్ - సిల్క్ స్మిత గురించి తమిళ పరిశ్రమలో వార్తలు పెద్ద దుమారాన్నే లేపాయి. వీరిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారని తమిళ మీడియా వార్తలు రాసింది. అయితే మరికొందరు, రజనీకాంత్ సన్నిహితులు మాత్రం అటువంటిదేదీ లేదంటూ కొట్టిపారేశారుకానీ స్మిత మాత్రం రజనీని మాత్రం తీవ్రంగా ప్రేమించింది. 35 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని అర్థాంతరంగా ముగించింది. ఇప్పటికీ ఆమె మృతి వీడని మిస్టరీలా నిలిచిపోయింది. మరణించే ముందు వరకు కూడా స్మిత ఒంటరిగానే జీవించింది. మంచి నటన, నృత్యాల్లో ప్రతిభ, మంచి హావభావాలు పలికించగలిగిన స్మిత మృతి మాత్రం అందరినీ కలచివేసింది.












Click it and Unblock the Notifications