చిరంజీవి Vs బాలకృష్ణ: బిగ్ ఫైట్

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నవారిలో చిరంజీవి, బాలకృష్ణ ఉంటారు. తర్వాత తరం హీరోలు వచ్చినప్పటికీ వీరిద్దరూ సినిమాల్లో దూసుకుపోతూ ఇప్పటికీ తమ సినిమాల పరంగా పోటీపడుతూనే ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి వీరిమధ్య పోరు నడుస్తోంది. ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య పరిశ్రమలోకి వచ్చినప్పటికీ తనకు నప్పే కథలతో, డైలాగులతో అందరినీ ఆకర్షించుకుంటూ అనతికాలంలోనే స్టార్ హీరోగా మారారు. విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా అడుగుపెట్టిన చిరంజీవి తన డ్యాన్స్, ఫైట్స్ తో అగ్ర కథానాయకుడిగా రూపాంతరం చెందారు.

వీరి అభిమానుల పరంగా కూడా ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. ఒకరి సినిమా వేడుకలకు మరొకరు హాజరవడం అనేది చాలా తక్కువగా జరుగుతుండేది. సినిమా విడుదల సమయంలో కూడా వీరిద్దరు పోటీపడేవారు. చిరంజీవి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలో తొలిసారిగా 2017లో సంక్రాంతికి బరిలోకి దిగారు. గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబరు 150తో పోటీపడ్డారు. మొన్న సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో పోటీపడ్డారు. సంక్రాంతి సీజన్ తో సంబంధం లేకుండా గతంలో కూడా ఎన్నోసార్లు విడుదల సమయంలో పోటీపడేవారు.

telugu star heros chiranjeevi and balakrishna Going to compete for Sankranti

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఎన్బీకే 109, చిరంజీవి విశ్వంభర సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ ఏడాది దసరాకే బాలయ్య చిత్రం విడుదల కావాల్సి ఉందికానీ షూటింగ్ ఆలస్యంగా జరుగుతుండటంతో సంక్రాంతికి విడుదల చేసే యోచనలో ఉన్నారు. రానున్న సంక్రాంతికి నాగార్జున, వెంకటేష్ సినిమాలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి బిగ్ ఫైట్ జరుగుతుందని భావిస్తున్నాయి. అయితే ప్రధానంగా మాత్రం చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్యే మరోసారి హోరాహోరీ పోరు జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+