ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేస్తున్న తెలుగు యంగ్ హీరో?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది. సినీ పరిశ్రమ అన్న తర్వాత ప్రేమలు, పెళ్లిళ్లు సహజంగా జరిగిపోతుంటాయి. పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు సంతోషంగా ఉన్నాయి. కొన్ని జంటలు మాత్రం పెళ్లయిన కొద్దిరోజులకే విడాకులు తీసుకుంటున్నాయి. ఎవరికి వారుగా బతికేస్తున్నారు. తాజాగా తెలుగు యంగ్ హీరో తాను ప్రేమించిన హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

వాస్తవానికి ఈ సమయానికి నిశ్చితార్థం కూడా జరిగిపోవాలి. అనివార్య కారణాలవల్ల నిశ్చితార్థం రద్దయినట్లు తెలుస్తోంది. పదిరోజులు ఆలస్యంగా ఆయన ఎంగేజ్ మెంట్ జరగబోతోందంటున్నారు. ఐదు సంవత్సరాల నుంచి ఓ హీరోయిన్ ను ప్రేమిస్తున్న ఆ హీరో తన కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అయితే నిశ్చితార్థం డేట్ కుదుర్చుకున్న తర్వాత కూడా ఎందుకు పోస్ట్ పోన్ చేశాడనేది మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. ప్రస్తుతం మీడియాలో ఈ హీరో పెళ్లివార్త సూపర్ గా ట్రెండ్ అవుతోంది. అనుకున్న ముహూర్తానికి ఎంగేజ్ మెంట్ చేసుకుంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

telugu young hero engagement cancelled

పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు వివాహాల బాట పడుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాతను వివాహమాడిన సంగతి తెలిసిందే. తాజాగా తాప్సి పన్ను, పూజాహెగ్డే కూడా అదే బాటలో పయనించనున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న కొన్ని జంటలు కూడా పెళ్లిచేసుకోవాలని నిశ్చయించుకున్నాయి.

హీరోలు, హీరోయిన్ల కుటుంబ సభ్యులంతా వారిపై ఒత్తిళ్లు తీసుకువస్తుండటంతో చాలామంది పెళ్లి బాట పడుతున్నారు. ఇదేకోవలో తెలుగు హీరో రామ్ పై కూడా ఇంట్లో సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడంటున్నారుకానీ దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+