ఆ నటి పెళ్లిలోనే హనీమూన్ చేసుకునేలా ఉందే
సెలబ్రిటీలు ఒక్కొక్కరు పెళ్లీ పీటలెక్కుతున్నారు. ఓ పక్క కెరీర్ కొనసాగిస్తూనే మరో పక్క వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల నటి వరలక్ష్మి తన ప్రియుడుతో నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే మంచి మూహార్తం చూసి పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతోంది ఈ భామ. పెళ్లి తరువాత తప్పకుండా సినిమాల్లో నటిస్తానంటూ ఓ ప్రకటన కూడా చేసింది. తాజాగా మరో నటి సడన్‌గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. ఆ నటి మరెవ్వరో కాదు అపూర్వ శ్రీనివాసన్.
అపూర్వ శ్రీనివాసన్ పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించేది. ఎన్టీఆర్ టెంపర్ సినిమా అపూర్వ శ్రీనివాసన్‌కు ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. అలాగే జ్యోతిలక్ష్మి సినిమా కూడా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. ఎక్కిడికి పోతావు చిన్నవాడా, విన్నర్, తొలిప్రేమ, కవచం, ప్రేమకథా చిత్రమ్2' లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.

అయితే గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న అపూర్వ సడన్‌గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. శ్రేయాస్ శివకుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ వివాహం జరిగిందని తెలుస్తోంది. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య సింపుల్‌గా పెళ్లి చేసుకుంది. అపూర్వ మెడలో మూడు ముడులు వేసిన తరువాత శ్రేయాస్ శివ కుమార్ భార్యను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను అపూర్వ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అపూర్వ పెళ్లిపై నెటిజన్ల రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకుని తమను నిరుత్సాహపరిచావు అని కొందరు కామెంట్స్ చేస్తూంటే...పెళ్లిలోనే హానీమూన్ చేసుకునేలా ఉన్నావ్ అంటూ మరికొందరు ముద్దు ఫొటోలను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అపూర్వ పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అపూర్వ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications