కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..!

కోలీవుడ్ స్టార్‌ హీరో, టీవీకే అధినేత విజ‌య్ తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తమిళం లోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రీసెంట్ గానే రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్దమవుతున్నారు. ఈ ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తన పార్టీ టీవీకే ద్వారా రంగంలోకి దిగి అధికారంలోకి రావాలని సన్నాహాలు చేస్తున్నారు.

విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్న తరుణంలో ఆయన నటించిన చివరి సినిమా 'జననాయగన్' హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. కానీ సెన్సార్ సర్టిఫికెట్ లభించకపోవడంతో ఆఖరి నిమిషంలో వాయిదా పడగా ఇప్పటికీ ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.

thalapathy-vijay-jana-jayagan-movie-leak-issue-got-viral-and-megastar-chiranjeevi-post-on-it-in-soci

ఈ క్రమంలోనే ఇప్పుడు అనూహ్యంగా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అలానే పలు పైరసీ వెబ్ సైట్లలో పూర్తి సినిమాని కూడా అందుబాటులో ఉంచడం పెద్ద రచ్చగా మారింది. అయితే ఈ ఘటనపై మొదట్లో కోలీవుడ్ పరిశ్రమ మౌనం వహించడం మరింత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ఘటనపై తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. "సినిమా అనేది నమ్మకం, కృషి, కలల సమాహారం. 'జననాయగన్' లీక్ కావడం నన్ను కలచివేసింది" అంటూ ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలు మొత్తం చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపుతాయని, సృజనాత్మకతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అదే సమయంలో, ఈ నష్టాన్ని ఎదుర్కోవడంలో నిర్మాణ సంస్థ KVN Productionsకు పూర్తి మద్దతు ప్రకటించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, పైరసీని అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు. "పైరసీని చంపేద్దాం... సినిమాను బతికిద్దాం" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో మెగాస్టార్ అంటే నిజంగా మెగాస్టార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక తమిళ నటుడు Sivakarthikeyan కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, సినిమాల పైరసీని తీవ్రంగా ఖండించారు. "ఒక సినిమా వెనుక వందలాది మంది కష్టం ఉంటుంది. దయచేసి థియేటర్లలో విడుదలయ్యే వరకు వేచి చూసి అక్కడే చూడండి" అని ఆయన పిలుపునిచ్చారు. పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. సంగీత దర్శకుడు G. V. Prakash Kumar, నటుడు Vijay Antony వంటి సినీ ప్రముఖులు కూడా ఈ లీక్‌ను ఖండిస్తూ పోస్టులు చేశారు. అయితే కోలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలు ఇప్పటికీ ఈ అంశంపై మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+