దళపతి విజయ్‌ను "27" సంఖ్య వెంటాడుతుందా.. అన్నీ ఆ రోజునే !
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తమిళం లోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడిగా పేరొందారు. రీసెంట్ గానే రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్దమవుతున్నారు. అయితే విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
విజయ్ - సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్యసాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా 2023లో విజయ్ - సంగీత మధ్య విభేదాలు వచ్చాయని.. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పెళ్లైన 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడాకులు కోరుతూ సంగీత కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని, నటితో బంధం వీగిపోయిందంటూ తనకు మాట ఇచ్చినప్పటికీ, ఆ మాట తప్పారని ఆమె ఆరోపించారు.

విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్ పట్టు జిల్లా కోర్టులో సంగీత పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ కి వివాహేతర సంబంధం ఉందనే కారణంగానే సంగీత డివోర్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కినట్లు ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. విజయ్ ప్రవర్తన వల్ల గడిచిన రెండేళ్లలో తను తీవ్ర మానసిక వేదన అనుభవించానని, గత్యంతరం లేక విడిపోవడానికి సిద్ధపడ్డానని ఆమె తన విడాకుల పిటిషన్ లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా ఈ వ్యవహారం చర్చకు తెర లేపింది.
ఈ క్రమంలోనే విజయ్ వ్యక్తిగత జీవితం, రాజకీయ విషయాలను గుర్తు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా వరుసగా '27' తేదీతో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ ఒక జాబితా చేర్చారు.
వైరల్ పోస్టులో ఇలా పేర్కొన్నారు:
సెప్టెంబర్ 27 - కరూర్ ఘటన
అక్టోబర్ 27 - బాధితులు చెన్నైలో కలిసిన రోజు
నవంబర్ 27 - సెంగొట్టయ్యన్ టీవీకేలో చేరిక
డిసెంబర్ 27 - JN ఆడియో లాంచ్
జనవరి 27 - JN కేసు మళ్లీ విచారణకు
ఫిబ్రవరి 27 - విడాకుల వార్త
ఈ తేదీలన్నీ 27నే కావడం యాదృచ్ఛికమా? లేక దీని వెనుక ఏదైనా రాజకీయ లేదా వ్యక్తిగత అనుబంధం ఉందా? అనే ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తుతున్నారు. అంతే కాకుండా 27 ఏళ్ల తర్వాతే విజయ్ భార్య విడాకులు కోరుతూ పిటిషన్ వేయడంతో ఆ సంఖ్య గురించి తెగ పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications