ట్రంప్‌తో టీ తాగించిన తెలుగు డైరెక్టర్.. కానీ అసలు ట్విస్ట్ అదే !!
ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. షార్ట్ ఫిల్మ్స్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే అభిమానులను మెస్మరైజ్ చేసి టాలెంటెడ్ డైరెక్టర్ గా నిరూపించుకున్నారు. ఆ తర్వాత విశ్వక్ సేన్ తో "ఈ నగరానికి ఏమైంది" మూవీ చేసి ఆడియన్స్ ని అలరించారు. ఆ తర్వాత కీడా కోలా చిత్రంతో మరోసారి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా రాణిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
రీసెంట్ గానే తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఓం శాంతి శాంతి సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ మలయాళంలో వచ్చిన "జయ జయహే" సినిమాకు రీమేక్ సినిమాగా వచ్చింది. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తరుణ్ భాస్కర్. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా "గాయపడ్డ సింహం".

ఈ మూవీలో జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకున్న ఈ సినిమా మే 1న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లతో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంటోంది. అందులో భాగం గానే తరుణ్ భాస్కర్ కూడా డిఫరెంట్ స్టైల్ లో తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ మేరకు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని రంగంలోకి దింపడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
తరుణ్ భాస్కర్ ఏఐతో రూపొందించిన ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో ట్రంప్ టీ తాగుతూ ఉండగా.. ఎలా ఉందంటూ తరుణ్ అడగడంతో.. ఇండియన్ టీ వెరీ నైస్ అంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. కానీ తరుణ్ మాత్రం ఇండియన్ టీ ఎప్పుడూ బాగానే ఉంటుంది అయితే మీరు తాగింది ఇరానీ టీ అంటూ షాక్ ఇచ్చారు. దీంతో ట్రంప్ ఆశ్చర్యంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ వీడియో చివర్లో ఈ మూవీని ఇరాన్‌లో మాత్రమే రిలీజ్ చేయడం లేదని.. ఓవర్‌సీస్‌లో ఎస్‌వీసీ, ప్రత్యుంగిరా సినిమాస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీ స్టోరీతో కూడా ట్రంప్ కి బాగా సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఓ యువకుడి జీవితంలో జరిగిన మార్పులు ఏంటి ? అనే స్టోరీతో గాయపడ్డ సింహం సినిమా తెరకెక్కించారు. ఏప్రిల్ 30నే ఈ మూవీ విదేశాల్లో రిలీజ్ కానుంది.
Dear NRI Simhalu… ❤️🔥#GaayaPaddaSimham Roaring Overseas Release by @SVCRelease @PrathyangiraUS 🦁🔥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) April 21, 2026
TRUMP’ING PREMIERES on APRIL 30 💥#GPS #TharunBhascker @JDmaxmode @fariaabdullah2 @Maanasa_chou @kasyapcineverse @pavansadineni @SAMWoffl @POVStoriesOffl @zeestudiossouth pic.twitter.com/7kqGeFXVl2












Click it and Unblock the Notifications