ఆ ముగ్గురు బాలీవుడ్ స్టార్స్‌కి షాకిచ్చిన అలహాబాద్ హైకోర్టు...
బాలీవుడ్ సూపర్ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీచేసింది. గుట్కా కంపెనీల ప్రకటనలపై బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ లకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు ఇచ్చింది.
పాన్ మసాల యాడ్స్ లో నటించిన ఈ ముగ్గురు బాలీవుడ్ స్టార్స్‌కు న్యాయస్థానం లీగల్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ గుట్కా ప్రకటనలకు సంబంధించిన కేసును అటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా విచారణ చేస్తోంది. గుట్కా కంపెనీలకు ప్రకటనలు ఇస్తున్న నటీనటులు, ప్రముఖులపై చర్యలు తీసుకోవాలని గతంలోనే కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ విషయంలో కొంతమంది నటులు వెనుకడుగు వేయగా, మరికొందరు సీనియర్ స్టార్స్ మాత్రం స్పందించలేదు.

వారిపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోర్టులో వాదించారు. మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో ఈ యాడ్స్‌పై పిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి ప్రకటనల్లో నటించడం సరికాదంటూ మోతీలాల్ యాదవ్ ఆ పిటిషన్‌లో పేర్కొనడం జరిగింది.
ఈ నేపథ్యంలో కేసును విచారించిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్నిఆదేశించింది. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో ఈ విషయంపై స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది.

కోర్టు నోటీసులు పంపిన.. స్పందించని స్టార్స్...
అయితే, ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌కు అక్టోబర్ 22నే షోకాజ్ నోటీసులు జారీ చేశామని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే శుక్రవారం కోర్టుకు ఈ సమాచారాన్ని తెలియజేశారు. పాన్ మసాల యాడ్స్‌లో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ కూడా నటించారు. అయితే, ఆయన ఈ విషయంలో వెనక్కి తగ్గారు. కానీ, ఆ సంస్థ మాత్రం ఇంకా అమితాబచ్చన్‌కు సంబంధించిన ప్రకటనలను టెలికాస్ట్ చేస్తోంది. దీంతో అమితాబ్ ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపినట్లు పాండే తెలిపారు. ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు, తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేయనున్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications