గుడ్‌న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ నటుడు..
బిగ్‌బాస్ నటుడు మానస్ గుడ్‌న్యూస్ చెప్పాడు. తనకి కొడుకు పుట్టాడని తెలుపుతూ ఫొటోలను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తన కొడుకుకు 'ధ్రువ'' అని పేరు కూడా పెట్టినట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశాడు. మానస్ బిగ్‌బాస్‌లో కంటే ముందు బుల్లితెర హీరోగా అందరికీ సుపరిచితుడే. పలు సిరీయల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.మానస్ టాప్ కంటెండర్ గా నిలిచాడు. మెచ్యూరిటీ గేమ్ తో తెలుగు అభిమానులందరిని ఆకట్టుకున్నాడు. ఈ షోతో బుల్లితెరపై, సోషల్ మీడియాలో మానస్ క్రేజీ స్టార్ గా మారిపోయాడు. ఓ పక్క టీవీ సీరియల్స్ లో నటిస్తూనే అప్పుడప్పుడూ మ్యూజిక్ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. యాంకర్ విష్ణుప్రియతో కలసి జరీ జరీ పంచె కట్టి అనే సాంగ్ లో కూడా మానస్ అద్భుతంగా డ్యాన్స్ చేసి అలరించాడు. ఇక, బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఆయన ప్రస్తుతం మాటీవీలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ క్యారెక్టర్‌లో ఇరగదీస్తున్నాడు. ఈ సీరియల్‌తో మరింత పాపులారిటీని పెంచుకున్నాడు. మానస్ చాలా తెలుగు సినిమాల్లోనూ నటించాడు. 'ఝలక్', గ్రీన్ సిగ్నల్, ప్రేమికుడు వంటి చిత్రాల్లో మానస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాడు.

నామకరణం ఫోటోలు..
ఇక, బుల్లితెర నటుడు మానస్ నిజ జీవితం గురించి చెప్పాలంటే, ఆయన గత ఏడాది శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది జూలై లో భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా సోషల్‌మీడియా వేదికగా ప్రకటించాడు. కొన్ని రోజుల క్రితం మానస్ కుటుంబంలో సంతోషం వెళ్లి విరిసింది. మానస్ భార్య శ్రీజ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక, తాజాగా మానస్ తన కొడుకుని అభిమానులకు పరిచయం చేస్తూ ఓ బ్యూటిఫుల్ షోటో షేర్ చేశాడు. మానస్, శ్రీజ దంపతులు తమ కొడుక్కి నామకరణం చేశారు. మానస్ తన కొడుకుకు ధృవ అనే పేరును పెట్టాడు. ఈ దంపతులిద్దరూ తమ బిడ్డని చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications