Jr.Ntr: చాలా సింపుల్ చొక్కా... ధర మాత్రం కేక!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్2 చేస్తున్నారు. ఇది పూర్తికావొచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేయబోతున్నారు. మూడు దేశాలను గడగడలాడించిన డ్రగ్ స్మగ్లర్ కథతో ఈ సినిమా రూపొందబోతోంది. దీనితర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తారా? దేవర2 చేస్తారా? అనేది సందిగ్ధంగా మారింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ సేద దీరుతున్నారు. షూటింగ్స్ కు, ప్రమోషన్స్ కు కాస్తంత విరామం ఇచ్చి దుబాయ్ లో జాలీగా ఉన్నారు.
చొక్కా ఖరీదు మాత్రం అదిరిపోయింది
అక్కడ స్టే చేసిన హోటల్ సిబ్బందితో కలిసి ఒక ఫొటో దిగారు ఎన్టీఆర్. ఆ ఫొటో చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ ఫొటోలో ఎన్టీఆర్ చాలా సన్నగా ఉండటమే కాకుండా వేసుకున్న చొక్కా కూడా ఆశ్చర్యపరిచేలా ఉంది. చూడటానికి అది చాలా సింపుల్ గా కనపడుతోంది. నీలిరంగులో ఉన్న ఈ చొక్క ఖరీదు మాత్రం రూ.85వేలు. దీనిపై అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. నీలిరంగుతోపాటు చొక్కాపై పువ్వుల డిజైన్ ఉంది. ఎట్రో అనే అంతర్జాతీయ బ్రాండ్ కు చెందిన చొక్కా అని తెలుస్తోంది.

పాన్ ఇండియా మార్కెట్ పై పట్టు కోసం
వార్2 సినిమాను ఆగస్టు 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాద్వారా పాన్ ఇండియా మార్కెట్ లో తన స్థానాన్ని పటిష్టపరుచుకోవాలని తారక్ భావిస్తున్నారు. అలాగే ఫొటోలో చూసిన విధంగా ఎందుకు సన్నగా ఉన్నాడు అంటూ చాలామంది ఆరాలు తీశారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తిందా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే అటువంటిదేమీ లేదని తేలింది. డ్రాగన్ సినిమా కోసం డైట్ మార్చుకున్నారని, దీనివల్లే సన్నబడ్డాడని, ఎన్టీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని అతని సన్నిహితులు చెప్పారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా పూర్తయిన తర్వాత తారక్ - రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications