Harish Shankar Vs Chota: ఎనీ టైమ్.. ఎనీ ప్లాట్ ఫామ్.. అయామ్ వెయిటింగ్..
సీనియర్ కెమెరామెన్ ఛోటా కె నాయుడు, దర్శకుడు శంకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదం అంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా రామయ్య వస్తావయ్యా గురించి. ఈ సినిమా గురించే ఇద్దరి మధ్య వివాదాం రాజుకుంది. రామయ్య వస్తావయ్యా సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చాలా మంది ఈ సినిమా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఎందుకంటే హరీశ్ శంకర్ అప్పటికే గబ్బర్ సింగ్ భారీ సినిమా అందించాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. దీంతో హరీశ్ శంకర్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్యా సినిమా భారీగా అంచనాలు పెరిగాయి. కానీ సినిమా ఫ్లాప్ అయింది. ఈ మూవీ వచ్చి 10 ఏళ్లైన తర్వాత ఈ మూవీ గురించి ఛోటా కె నాయుడు చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. ఛోటా కె నాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హరీశ్ శంకర్ సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

రామయ్య వస్తావయ్యా మూవీ షూటింగ్ దర్భంగా డైరెక్టర్ హరీశ్ శంకర్, తనకు మధ్య గ్యాబ్ వచ్చిందని చెప్పారు. తనకున్న అనుభవంతో కొన్ని సూచనలు చేస్తే శంకర్ వాటిని పట్టించుకోలేదన్నారు. దీంతో హరీశ్ ఏం చెబితే అదే చేసినట్లు చెప్పాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఛోటా కామెంట్లపై హరీశ్ తీవ్రంగా స్పందించారు. ఓ లేఖను విడుదల చేశాడు. గౌరవనీయులైన ఛోటా కె నాయుడు అంటూ.. రామయ్య వస్తావయ్యా మూవీ వచ్చి 1ర0 ఏళ్లు అయింది.
తను ఎప్పుడు ఛోటా గురించి తప్పుగా మాట్లాడలేదని హరీశ్ చెప్పాడు. "మీరు మాత్రం నా గురించి తప్పుగా చెబుతున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మిమ్మల్ని తీసి వేరేవారిని పెట్టుకుందామని అనుకున్నా.. కానీ దిల్ రాజు అపారు. గబ్బర్ సింగ్ నా మూవీ అని ఎలా అంటానో.. రామయ్య వస్తావయ్యా కూడా నా సినిమానే" అని హరీశ్ శంకర్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ సినిమా గురించి మాట్లాడం ఆపండి అని అన్నారు. లేదు అంటారా..ఎనీ టైమ్.. ఎనీ ప్లాట్ ఫామ్.. అయామ్ వెయిటింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.












Click it and Unblock the Notifications