ఆలస్యమవడం ‘అఖండ2’కు అమృతంలా మారింది!

మన పెద్దలు ఆలస్యం.. అమృతం.. విషం అని చెబుతుంటారు. అంటే ఆలస్యమైతే అమృతం కూడా విషంలా మారుతుందని దీని అర్థం. అయితే ఒక్కోసారి ఇది రివర్స్ అవుతుంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలస్యం అనేది కొందరికి వరంగా మారుతుంది. తాజాగా ఈనెల 5వ తేదీన విడుదల కావాల్సిన అఖండ2 వారం రోజులు ఆలస్యంగా 12వ తేదీన విడుదలైంది. అయితే ఈ ఆలస్యం అఖండ2కు బాగా కలిసివస్తోంది. అఖండ మొదటి భాగం హిట్ కావడం, సీక్వెల్ గా వస్తున్న అఖండ2 తాండంపై అంచనాలు విపరీతంగా ఉండటంతో మరో వారం రోజులు గడిచేసరికి ఆ అంచనాలు ఇంకా పెరిగాయి.

వారం లేటైనా బజ్ తగ్గలేదు
దీంతో సినిమా విడుదలకు మూడు రోజులు ముందే అడ్వాన్స్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ప్రీమియర్ షోలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇవన్నీకలిపి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు ఆనందాన్ని కల్పించాయి. అంతేకాదు.. అఖండ2 విడుదలైన మొదటిరోజు 60 నుంచి 80 కోట్ల మధ్యలో కలెక్షన్లు సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నిర్మాణ సంస్థ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కేవలం సినిమా వారం రోజులు ఆలస్యంగా విడుదల కావడంవల్ల ఇంతగా కలిసివస్తుందా? అని ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సినిమా రిలీజవడం ఆలస్యమైతే రోజురోజుకు దానిమీద క్రేజ్ తగ్గిపోతుంది. బజ్ ఉండదు. కానీ అఖండ2 విషయంలో మాత్రం అంతా రివర్స్ లో జరిగింది.

The delay has turned out to be a blessing in disguise for Akhanda 2

ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభావం ఎంతో చూడాలి
సినిమా విడుదలైన తర్వాత అఖండగా బాలయ్య పాత్ర చూసి థియేటర్లలో అభిమానులకు పూనకాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. అదే బోయపాటి స్టైల్ అంటున్నారు. ఏదేశమైనప్పటికీ హిందుత్వ అజెండాగా పాన్ ఇండియా స్థాయిలో విడదలైన ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో ఏమేరకు కలెక్షన్లు రాబడుతుంది? ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎంతమేరకు ఆదరణ దక్కుతుందనేది చూడాలి. వాస్తవానికి 5వ తేదీన అఖండ2 అనగానే ఉత్తరాది రాష్ట్రాల్లోకూడా రణవీర్ సింగ్ నటించి దురంధర్ కు బుకింగ్స్ తగ్గాయి. అయితే ఈ సినిమా అనూహ్యంగా ఘనవిజయం సాధించడంతో అఖండ2 ప్రభావం ఏమేరకు ఉంటుందనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+