హీరో దర్శన్ ఎలాంటి వాడో అని చెప్పిన మేనమామ, మేము రోడ్డున పడ్డాము, శత్రువులు అంటే ?

కన్నడ స్టార్ హీరో దర్శన్ మొదటి నుంచి ఏదో ఒక వివాదాంలో చిక్కుకుని నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయిన నటుడు దర్శన్‌ను బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు రావడంతో హీరో దర్శన్ మరిన్ని చిక్కుల్లో పడుతున్నాడని కన్నడ సినీ ఇండస్ట్రీ మాట్లాడుకుంటున్నది.

మరోవైపు కుటుంబసభ్యులంతా హీరో దర్శన్ కు దూరంగా ఉండడంతో ఆయన మేనమామ కూడా హీరో దెబ్బకు వీధిన పడ్డారనే సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్ కావడంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా దర్శన్‌పై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. హీరో దర్శన్ మీద హత్యారోపణలు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

The hero s uncle made sensational comments about Kannada actor Darshan

.

హీరో దర్శన్‌ అరెస్ట్‌ కావడంతో పాత ఘటనల్లో దర్శన్‌ వల్ల అన్యాయానికి గురైన వారు ఇప్పుడు ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు దర్శన్ మేనమామ కూడా దర్శన్ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేణాకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు వినిపించడంతో ఆ హీరో సొంత ఊరు అయిన కొడగు జిల్లా పొన్నంపేటలో స్థానికులు, కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు.

మరోవైపు, దర్శన్, అతని తల్లి తమ కుటుంబాన్ని స్వయంగా ఇబ్బందులకు గురిచేశారని దర్శన్ పుట్టి పెరిగిన ఇంటిని కూల్చివేశారని, ఈ కేసులో తల్లీ కొడుకులిద్దరూ కేసు ఎదుర్కొంటున్నారని ఆయన మేనమామ శ్రీనివాస్ గురువారం మీడియాకు చెప్పారు. ఆస్తి విషయంలో మేనమామతో గొడవపడిన హీరో దర్శన్ అతను పుట్టిపెరిగిన పొన్నంపేటలో నివాసం ఉండే ఇంటిని కూల్చివేశాడని ఆయన మేనమామ శ్రీనివాస్ ఆరోపించారు.

హీరో దర్శన్, అతని తల్లి మీనా ఈకేసు విచారణను ఎదుర్కొంటున్నారు. భార్యతో గొడవ జరిగినప్పుడు కూడా దర్శన్ ను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని చెప్పామని, అయినా దర్శన్ లో మార్పు రాలేదని, మళ్లీ మళ్లీ దర్శన్ దంపతులు గొడవ పడుతూనే ఉన్నారని ఆయన మేనమామ విచారం వ్యక్తం చేశారని న్యూస్ 18 కన్నడ ఛానల్ తెలిపిందని గురువారం రాత్రి కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి.

పవిత్ర గౌడతో తన మేనల్లుడు దర్శన్ కు ఉన్న సంబంధం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటే వీళ్లిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో తనకు తెలియదని, ఆ భగవంతుడికే తెలుసని హీరో మేనమామ అన్నారు. అయితే పవిత్రా గౌడతో ఉన్న సంబంధం హత్యలు చేసే వరకు దారి తియ్యడం చాలా బాదగా ఉందని, హత్యకు గురైన రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలని దర్శన్‌ మేనమామ శ్రీనివాస్ పొన్నపేటలో మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+