ఖర్చు రూ.15 కోట్లు... వచ్చింది రూ.304 కోట్లు!

రూ.15 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీశారు.. వచ్చింది రూ.304 కోట్లు. తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. వాస్తవానికి ఏ సినిమా విడుదలైనా నెల లేదంటే రెండు నెలలకు ఓటీటీల్లో వచ్చేస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం 9 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతోంది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగా ఆదరించారంటే పొన్నియన్ సెల్వన్2, పఠాన్ సినిమాలకన్నా ఈ సినిమాకే IMDb రేటింగ్ ఎక్కువగా ఉంది.

సినిమా విడుదలైనప్పుడు పెద్దగా ఆర్భాటం లేదుకానీ విడుదలైన తర్వాత మాత్రం ప్రభంజనాలే సృష్టించింది. థియేటర్లలో జనాలు దీన్ని చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. 2023 మే 5వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ షా నిర్మించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎన్నో వివాదాలు వచ్చాయి. విడుదలైన మొదటి రోజు రూ. 8.03 కోట్లను రాబట్టింది. ఆ సినిమా ఏదంటే.. 'ది కేరళ స్టోరీ'.

the kerala story streaming zee5 from february 16th 2024

ఈ చిత్రంలో అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. ఏడాది పొడవునా ఆమె లైమ్‌లైట్‌లో నిలిచారు. చాలా రాష్ట్రాలు ఈ సినిమాను నిషేధించాయి. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వసూళ్లు కూడా భారీగా వచ్చాయి. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు. సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 304 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+