Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీగా పెరిగిన అల్లు అర్జున్- స్నేహా రెడ్డి ఆస్తులు.. ఎన్ని కోట్లో తెలుసా..?

పుష్ప-2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. భారతీయ చిత్రపరిశ్రమలో న భూతో న భవిష్యత్ అన్నంతగా కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ లెక్క మారిపోయింది. అటు సినిమాలు, ఇటు బిజినెస్ లు, బ్రాండ్ ప్రొమోషన్స్ ద్వారా బన్నీ భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

The Lavish Life of Allu Arjun Style Swag amp amp Stardom

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ సమాచారం ప్రకారం అల్లు అర్జున్ నికర ఆస్తి విలువ 500 కోట్లకు పైనే ఉంటుందని టాక్. అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు ఆయన వేతనం రూ. 3,500 మాత్రమే. కానీ ఇప్పుడు ఆయన వేతనం ఒక్కో సినిమాకు రూ. 200కోట్లకు పైమాటే. ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల్లో అల్లు అర్జున్ ఒకరు. అటు మూవీస్ తో పాటు ప్రొడక్షన్, హాస్పిటాలిటీ, బ్రాండ్ ప్రొమోషన్.. తదితర రంగాల్లో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదిస్తున్నారట బన్నీ.

The Lavish Life of Allu Arjun Style Swag amp amp Stardom

హైదరాబాద్ శివారులోని నార్సింగిలో అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్ టైన్ మెంట్(ప్రొడక్షన్ హౌజ్) ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో ఓ విలాసవంతమైన భవనం ఉంది. అల్లు అర్జున్ దగ్గర ఉన్న కార్లలో ముఖ్యమైనవి రేంజ్ రోవర్, హ్యామర్ హెచ్ 2, జాగ్వార్ XJL, వోల్వో XC90 T8, మెర్సిడిస్ GLE 350d,BMW X6m,ఫాల్కన్ వ్యానిటీ వ్యాన్ ఉన్నాయి. అంతేకాక ఆయనకు ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

The Lavish Life of Allu Arjun Style Swag amp amp Stardom

ఇక అల్లు అర్జున్ ఫ్యామిలీ నిర్మాణ రంగం లో ఉన్నారని అందరికి తెలిసిందే. గత 50 ఏళ్లుగా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఎన్నో ఇండస్ట్రీ హిట్లు.. మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. రీసెంట్ గా అల్లు స్టూడియోస్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ స్టూడియోస్ లో అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, బ్రదర్స్ తో కలిసి ముఖ్య భాగస్వామిగా ఉన్నాడు.

అంతే కాదు అల్లు ఫ్యామిలీ మై హోమ్స్ తో కలిసి ఆహా ఓటీటీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కూడా అల్లు అర్జున్ భాగస్వామిగా ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా, సుకుమార్ తో పుష్ప- 3 చేస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+