Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

థియేటర్‌లో ఎక్కువ మంది చూసిన సినిమా

ఒకప్పుడు బాలీవుడ్ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమను చాలా తక్కువగా చూసింది. మన సినిమాలను అటువైపు విడుదల చేయనివ్వకుండా, ఎదగనీయకుండా చేసింది. కానీ కాలం మారింది. కాలంతోపాటు ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. అందుకనుగుణంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బాలీవుడ్ ఘోరంగా విఫలమైంది. ఆ పరిశ్రమ నుంచి చాలా తక్కువ సంఖ్యలోనే హిట్ సినిమాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో తెలుగు సినిమా అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. బాహుబలితో మొదలై ఆర్ఆర్ఆర్, పుష్ప, దేవర వరకు ఈ క్రేజ్ సాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ భాషల ప్రేక్షకులంతా తెలుగు సినిమాలను చాలా తీవ్రంగా ఇష్టపడుతున్నారు.

10 కోట్ల 55 లక్షల మంది చూశారు
అందుకు కారణం ప్రేక్షకులకు కావల్సిన మాస్ అంశాలను మన దర్శకులు పుష్కలంగా దట్టించడమే. మన తెలుగులో ఉన్నంతమంది స్టార్ హీరోలు ఏ భాషలోను ఉండరు. ఇప్పుడు అందరూ దాదాపుగా పాన్ ఇండియా హీరోలు అయ్యారు. మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలుగా మారిపోతున్నారు. మరోవైపు బాలీవుడ్ రోజురోజుకు వెనకబడిపోతోంది. బాహుబలి2 సినిమా విడుదలై రూ.1830 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి, రాజమౌళి గురించి మాట్లాడుకున్నారు. ఈ సినిమాను థియేటర్లలో 10 కోట్ల 55 లక్షల మంది ప్రేక్షకులు చూశారు. ఒక సినిమాను అన్నికోట్ల మంది థియేటర్లలో చూడటం అనేది భారతదేశ సినీ చరిత్రలో ఇదే తొలిసారి.

The most watched movie in the theater

టాలీవుడ్ ఖ్యాతి పెరిగింది
అటువంటి సినిమా మన తెలుగు సినిమా అవడం, హీరో మన తెలుగువాడు కావడం, దర్శకుడు కూడా మన తెలుగువాడే కావడం అనేది మన టాలీవుడ్ ఖ్యాతిని పెంచింది. అప్పటినుంచి పరిశ్రమ వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కాకపోతే హీరోలు, దర్శకులు రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమా చేసుకుంటూ అభిమానులను, థియేటర్ యాజమాన్యాన్ని తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. మహేష్ బాబు - రాజమౌళి సినిమా, జూనియర్ ఎన్టీఆర్ వార్2, డ్రాగన్, ప్రభాస్ రాజాసాబ్, స్పిరిట్, కల్కి2, సలార్2, అల్లు అర్జున్ - అట్లీ సినిమా, రామ్ చరణ్ పెద్ది... ఇలా అన్నీ పాన్ ఇండియా సినిమాలే రాబోతున్నాయి. ఇవన్నీ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+