18 సార్లు రూ.100 కోట్లు సాధించిన ఏకైక హీరో

ఒకానొక సమయంలో ఒక సినిమా రూ.100 కోట్లు వసూలు చేయడం అంటే అది ఒక అద్భుతం కింద లెక్క. మనదేశంలో ప్రపంచంలో ఏడోవింతను, ఎనిమిదో వింతను చూసినట్లు చూసేవారు. ఎంతో అరుదుగా ఇటువంటి రికార్డు నమోదయ్యేది. అయితే కాలక్రమంలో రూ.100 కోట్లు వసూలు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. మొదటి రెండువారాలు టికెట్ ధరల పెంపు, దాదాపుగా అన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేస్తుండటం లాంటి కారణాలతోపాటు సినిమా పర్వాలేదు అనే టాక్ వచ్చినా చాలు సినిమా చాలా సులువుగా రూ.100 కోట్లు వసూలు చేసేస్తోంది. ప్రభాస్ లాంటి నటుడికైతే ప్రస్తుతం మొదటిరోజే రూ.100 నుంచి రూ.175 కోట్ల వరకు కలెక్షన్లు వస్తున్నాయి.

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా..
బాలీవుడ్ కు చెందిన భజరంగీ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఇతర హీరోలకన్నా చాలా ముందంజలో నిలిచారు. అతని సినిమాలు రూ.100 కోట్ల మార్కును అందుకోవడం అనేది అవలీలగా జరుగుతోంది. ఈ కండలవీరుడికి చెందిన 18 సినిమాలు ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలపైన వసూలు చేశాయి. మరే హీరో కూడా ఈ రికార్డును అందుకోలేకపోయాడు. అందుకోలేకపోతున్నాడు. దబాంగ్, రెడీ, బాడీగార్డ్, దబాంగ్2, జైహో, కిక్, ఏక్ థా టైగర్, భజరంగీ భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, భారత్, దబాంగ్ 2, టైగర్ జిందాహై, టైగర్3, కిసీకాభాయ్ కిసీకీ జాన్, సికిందర్ సినిమాలన్నీ రూ.100 కోట్లు వసూలు చేశాయి. సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ సినిమాలన్నీ రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయి.

The only hero to have earned Rs 100 crores 18 times

సికిందర్ తో మరోసారి
తాజాగా సికిందర్ సినిమాతో రూ.100 కోట్ల మార్క్ మరోసారి అందుకున్నాడు. సోలో హీరోగానే ఇవన్నీ సాధించాడు. ఒకరకంగా భవిష్యత్తులో కూడా మరే హీరోకు ఇది సాధ్యం కాదని చెప్పొచ్చు. సినీ విశ్లేషకులైతే చాలా కష్టం అంటున్నారు. భవిష్యత్తులో యువహీరోలెవరైనా అందుకునే అవకాశం కూడా ఉండొచ్చంటున్నారు. ఏదేశమైనప్పటికీ సల్మాన్ ఖాన్ 18 సార్లు రూ.100 కోట్ల ఫీట్ సాధించడంపై అతని అభిమానులు సోషల్ మీడియాలో చాలా గర్వంగా కామెంట్లు పెడుతున్నారు. తెలుగులో కూడా చాలామంది స్టార్ హీరోలున్నారు. వారంతా సులువుగా రూ.100 కోట్లను సాధిస్తున్నారు. భవిష్యత్తులో వీరేమైనా సల్మాన్ రికార్డును బద్దలు కొడతారేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+