రజనీకాంత్‌కు కూతురిగా, లవర్‌గా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్

రజనీకాంత్ గురించి భారతదేశంలోనే కాదు విదేశాల్లో ముఖ్యంగా జపాన్, చైనా, కొరియా దేశాల్లో కూడా పరిచయం అవసరంలేదు. ఎందుకంటే మన తెలుగువారు, తమిళులు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, లండన్ లో ఎక్కువగా ఉంటారు. మిగతా దేశాల్లో చాలా తక్కువగా ఉంటారు. తెలుగువారు, తమిళులు లేని ప్రాంతాల్లో, దేశాల్లో కూడా రజనీకాంత్ కు అక్కడి స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ ఉంది. ఆయన స్టైల్ అంటే చాలు జపాన్ వారు పడిచచ్చిపోతారు. స్టైల్ గా చేయి తిప్పినా, సిగరెట్ ఎగరేసి నోట్లో పెట్టుకున్నా... ఇలా అడుగు తీసి అడుగు వేసినా అది రజనీకాంత్ స్టైల్ కిందకే వస్తుంది. మరే స్టార్ హీరోకు అది సరిపోలదు.

కంపెనీలకు సెలవు ప్రకటిస్తారు
రజనీకాంత్ నుంచి సినిమా వస్తోందంటే కంపెనీలకు సెలవు ప్రకటిస్తారు. ఉద్యోగులకు టికెట్లు కొనిస్తారు. అదీ అతని మేనియా. సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లతో రజనీకాంత్ కలిసి నటించారు. అయితే రజనీకి కూతురుగా, మరదలుగా, ప్రేమికురాలిగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఒక్కరే ఉన్నారు. ఆమె ఎవరో కాదు అందాల నటి మీనా. బాలనటిగా పరిశ్రమలోకి ప్రవేశించి తన నటనతో ఆకట్టుకొని, యుక్తవయసు రాగానే హీరోయిన్ అయ్యింది. తెలుగు, తమిళం, మళయాళంలో స్టార్ హీరోలందరి సరసన నటించింది. 1982లో వచ్చిన తమిళ సినిమా 'నెంజంగల్'లో మీనా నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'ఎంకెయో కెట్టా కురల్'సినిమాతో కుమార్తె పాత్ర పోషించింది.

The only heroine to play Rajinikanth s daughter lover and wife characters

24 ఏళ్ల తర్వాత మరోసారి?
కాలక్రమంలో ముత్తు, యజమాన్, వీరలాంటి సినిమాల్లో ప్రేమికురాలిగా, భార్యగా, మరదలిగా నటించింది. దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఈ జంట మరోసారి మరో సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై వివరాలు చెప్పమని ఓ ఇంటర్వ్యూలో మీనాను అడగ్గా ఆమె నిరాకరించారు. అనారోగ్య కారణాలతో భర్త మరణించడంతో ఏకైక కుమార్తెతో ఒంటరిగా జీవిస్తోంది. మీనా కుమార్తె కూడా ఇళయ దళపతి విజయ్ సినిమాలో నటించింది. మీనా రెండో పెళ్లిపై రకరకాల వార్తలు వచ్చినప్పటికీ ఆమె వాటిని ఖండించింది. ప్రస్తుతం తన రెండో ఇన్నింగ్స్ లో కూడా అగ్రహీరోలతో కలిసి నటిస్తోంది. సీనియర్ హీరోలకు ప్రత్యేకమైన ఆప్షన్ గా మీనా నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+