ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి 'ది ప్యారడైజ్'.. అసలు కారణమిదే?
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో కాయదు లోహార్, మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఈ చిత్రంపై అంచనాను అమాంతం పెంచేశాయి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యం హీరో నాని 'ది ప్యారడైజ్' ట్రైలర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
'ది ప్యారడైజ్' సినిమాకు ట్రైలర్ రిలీజ్ చేయట్లేదని హీరో నాని వెల్లడించారు. సినిమా విడుదలకు తక్కువ సమయం ఉండటంతో ట్రైలర్ కట్ సాధ్యం కాలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని నాని చెప్పుకొచ్చారు. ఎందుకంటే నాణ్యతతో కూడిన సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా టీంలు కలిసి పనిచేస్తున్నాయని.. ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలన్నారు. అది కావాలంటే నాలుగైదు రోజులు శ్రీకాంత్, అందరూ దానిపై పనిచేయాలని.. విడుదలకు తక్కువ సమయం ఉన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండానే సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది.

మరోవైపు షూటింగ్లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎవరినో కొట్టినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని నాని చెప్పారు. మూవీలో అండర్ వాటర్ ఎపిసోడ్, 1000 మందితో ఫైట్ ఉందనే ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ముందుగా అనౌన్స్ చేసిన సెప్టెంబర్ 24న సినిమా విడుదల అవుతుందని నాని స్పష్టం చేశారు.
#NANI:
— Movies4u Official (@Movies4u_Officl) September 11, 2026
"Stop Using the Term PAN INDIA.
It's an OVER ABUSED Term."#TheParadise pic.twitter.com/0B0CXzjAE6














Click it and Unblock the Notifications
