'రాజాసాబ్' డిస్ట్రిబ్యూటర్ సంచలన ఆడియో లీక్.. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రాజాసాబ్' మూవీ మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధం అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఏపీలో ప్రీమియర్స్ కు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత డార్లింగ్ ప్రభాస్ నుంచి కామెడీ ఎంటర్ టైనర్ వస్తున్న నేపథ్యంలో రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
— Varma Salaar 🦖 (@Ravi60478244) January 7, 2026
అయితే తాజాగా రాజాసాబ్ సినిమా చూసిన ఓ డిస్ట్రిబ్యూటర్ తన అభిప్రాయాన్ని మరో వ్యక్తితో పంచుకున్న ఆడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మూవీలో ప్రభాస్ యాక్టింగ్, ఫైట్స్, గ్రాఫిక్స్, వీఎఫెక్స్ బాగున్నాయని.. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కితాబు ఇచ్చారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ సూపర్ ఉందని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవి దొంగ మొగుడు సినిమా తరహాలో కామెడీ ఎపిసోడ్స్ ను డైరెక్టర్ మారుతి డిజైన్ చేశారని.. ఆ ఎపిసోడ్స్ లో ప్రభాస్ చింపేశారని అన్నారు. ఇక క్లైమాక్స్ 30 నిమిషాలు సినిమాకు మేజర్ హైలెట్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో ఎక్స్ లో వైరల్ అవుతోంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ కావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

ఇక ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ సుమారుగా 3 గంటల 10 నిమిషాలు ఉంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ నటించారు. అలాగే రాజాసాబ్ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి బుకింగ్స్ లో టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరికొద్ది సేపట్లో నైజాం బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications