ప్రభాస్ 'రాజాసాబ్' ట్రైలర్ వచ్చేసింది.. 1000 కోట్ల బొమ్మ లోడింగ్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కిన ది రాజాసాబ్ ట్రైలర్ 2.0 తాజాగా విడుదలైంది. 3 నిమిషాల 12 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ చిత్రంగా రూపొందిన విషయం తెలిసిందే. ట్రైలర్ లో ప్రభాస్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. గతంలో రిలీజైన ట్రైలర్ కు ఇప్పడు రిలీజైన ట్రైలర్ కు చాలా తేడా ఉంది. ఈ ట్రైలర్ ను తెలుగుతోపాటుగా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేసింది చిత్ర బృందం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఆయన వేషధారణ, డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ మూవీని డైరెక్టర్ మారుతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ- రిలీజ్ ఈవెంట్ విజయవంతమైన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9,2026 లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే యూకే, ఆస్ట్రేలియాలో ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ది రాజాసాబ్ మూవీకి థమన్ మ్యూజిక్ అందించారు. ఇది రొమాంటిక్ కామెడీ హారర్ ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన నెటిజన్లు మరో రూ. 1000 కోట్ల బొమ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక సంక్రాంతి కానుకగా ఈ సారి చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ మూవీ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలకు సిద్ధమైంది. అలాగే నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ కూడా రిలీజ్ కానుంది. ఇక శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా జన నాయగన్ కూడా పొంగల్ కానుకగా విడుదల కానుంది. దీంతో ఈ సారి బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications