'రాజాసాబ్' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే తెలంగాణలో ఇంకా ప్రీమియర్స్ స్టార్ట్ కాలేదు. కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం అటు ప్రీమియర్ షోస్ తో పాటుగా ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే ప్రభాస్ దాదాపు 15 ఏళ్ల తర్వాత చేస్తున్న ఎంటర్ టైన్ మైంట్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే దుబాయ్ లో షోస్ ఇప్పటికే పూర్తయ్యాయి. అలాగే ఈ మూవీ చూసిన వాళ్లు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

మూవీలో ప్రభాస్ రాజాసాబ్ క్యారక్టర్ చాలా బాగా వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. డార్లింగ్ నుంచి కామెడీ టైమింగ్ ను చాలా బాగా డైరెక్టర్ మారుతి వాడుకున్నట్లు తెలుస్తోంది. ఇక మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయని టాక్. ముఖ్యంగా దెయ్యానికి ప్రభాస్ భయపడే సన్నివేశాలు ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా చేస్తుందని తెలుస్తోంది. ప్రభాస్ కామెడీ టైమింగ్ మెంటల్ ఎక్కించేలా ఉంటుందట. మారుతి సినిమాకే వచ్చామా..? అన్న అనుమానం ఫ్యాన్స్ కు కలుగుతుందని టాక్.

ఇక తమన్ 1000 శాతం డ్యూటీ చేశాడని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తోందంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అలాగే ప్రభాస్ ఎంట్రీ కార్డు కూడా ఆయన గత సినిమాల పోస్టర్లను దృష్టిలో పెట్టుకుని సూపర్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక సెకండాఫ్ లో హాస్పిటల్ సీన్ బాగా వచ్చిందట. అలాగే చివరి 30 నిమిషాల క్లైమాక్స్ మూవీకి పెద్ద ప్లస్ అని సమాచారం. క్లైమాక్స్ ను మారుతి అత్యద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తానికి మూవీ బ్లాక్ బస్టర్ అంటూ రెబల్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఫుల్ రివ్యూ తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే..

The Raja Saab Twitter Review Live Prabhas Vintage Charm Back Is It a Horror-Comedy Blockbuster Hit

ఇక ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. తమన్ మ్యూజిక్ అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+