బాలయ్య ఫంక్షన్‌కు రానని ముఖంమీదే చెప్పిన స్టార్ హీరో?
నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఈరోజుకు 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నారు. తాతమ్మకల సినిమాతో ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టారు. బాలయ్య 50 సంవత్సరాల సినీవేడుకను పురస్కరించుకొని పరిశ్రమ పెద్దలు సెప్టెంబరు ఒకటోతేదీన బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీరంగ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డితోపాటు ఇతర ప్రముఖులు హాజరుకాబోతున్నారు.
విముఖత చూపిన స్టార్ హీరో
చిరంజీవి, అల్లుఅర్జున్ లాంటివారందరికీ ఆహ్వానాలు అందాయి. అందరూ వస్తామని మాటిచ్చారు. అయితే కమిటీ సభ్యులు ఆహ్వానించేందుకు ఓ స్టార్ హీరో ఇంటికి వెళ్లగా ఆయన బాగానే వారిని ఆదరించారు. వేడుకకు రమ్మనమని కోరగా అందుకు మాత్రం ఆయన విముఖత చూపారు. కుదరదని, పనులున్నాయని ముఖంమీదే చెప్పేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను వేడుకకు రప్పించేందుకు పెద్దలు శతధా ప్రయత్నించినప్పటికీ ఆయన మాత్రం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అందుకు కారణం ఏమిటనే విషయంపై వారు డైలమాలో పడిపోయారు.

పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి
వీరు పిలిచిన వ్యక్తి తెలుగు అగ్ర కథానాయకుడు. సినీ పరిశ్రమల్లో అతి పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి. వ్యాపార పరంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే బాలయ్యతో కొన్ని సంవత్సరాలుగా ఈయనకు సఖ్యతలేదని తెలుస్తోంది. వీరిమధ్య సయోధ్య కుదర్చడానికి ఎంతోమంది ప్రయత్నించారుకానీ వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. బాలయ్యకు, ఈ హీరోకు ఎన్ని విభేదాలున్నప్పటికీ అరుదుగా జరిగే వేడుక కాబట్టి కచ్చితంగా వస్తారని ఆహ్వాన పెద్దలు భావించారు. అయితే వారికి ఆ స్టార్ హీరో నిర్మొహమాటంగా చెప్పేయడంతో వారికి ఏమీ పాలుపోని పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications