థియేటర్లు తగలబడిపోతాయ్.. భారీ సెట్, 500 మంది డాన్సర్లతో ఎన్టీఆర్ - హృతిక్ స్పెషల్ సాంగ్

చిత్ర పరిశ్రమలో తోపు డాన్సర్స్ అంటే గుర్తొచ్చే వారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం 'వార్ 2'. అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ 'వార్' సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తుంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తుండ‌గా.. ప్రస్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తునారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఈ మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే డ్యాన్స్ సీక్వెన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఆ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేసి ఏకంగా 500 మంది డాన్సర్లను రంగంలోకి దించుతున్నట్టు టాక్ నడుస్తోంది. య‌ష్‌రాజ్ స్టూడియోలో ప్రస్తుతం ఈ డ్యాన్స్ షూటింగ్ జ‌రుగుతున్నట్లు స‌మాచారం. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా.. ఈ సాంగ్‌ని బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారని అనుకుంటున్నారు.

Theaters will burn Huge set 500 dancers for NTR - Hrithik special song

తమకి తామే పోటీ అనేలా చెలరేగే ఈ ఇద్దరు డాన్సర్లు.. ఈసారి కలిసి డాన్స్ చేస్తే థియేటర్లు తగాలబడిపోవడం గ్యారంటీ అని.. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు లానే ఈ సాంగ్ కూడా వండర్స్ క్రియేట్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఈ సినిమా తారక్‌ బాలీవుడ్‌ డెబ్యూ చిత్రం కావడంలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి తారక్‌ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ రీసెంట్ గానే షూటింగ్ నుంచి తారక్ పిక్స్ లీక్ అయ్యి వారాల అయిన విషయం తెలిసిందే.

ఇక RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యారు. రీసెంట్ గానే ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. అలానే ఎన్టీఆర్‌ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. వార్ 2 తర్వాత దేవర 2, ఎన్టీఆర్‌31 చిత్రాలు చేయనున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+