Thella Kaagitham Movie Review: తెల్లకాగితం మూవీ రివ్యూ.. లవ్ స్టోరీకి కొత్త టచ్!

Thella Kaagitham Movie Review: 'కోర్ట్' సినిమా ఫేమ్ హర్ష్ రోషన్, అజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'తెల్లకాగితం'. నూతన నటి నక్షత్ర ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది. రమేష్ బ్రాండ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మించగా.. సీనియర్ డైరెక్టర్/సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. నేడు(అక్టోబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

Don’t Trouble the Trouble Movie Review: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?
Don’t Trouble the Trouble Movie Review: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

స్టోరీ
'తెల్లకాగితం' సినిమా రాము(హర్ష్ రోషన్), ఆశా(నక్షత్ర) అనే ఇద్దరు టీనేజర్ల జీవితాల చుట్టూ జరుగుతుంది. స్కూల్ రోజుల్లోనే ఒకరినొకరు ప్రేమించుకున్న ఈ జంట, అనుకోకుండా చేసిన ఓ పొరపాటు వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పుతుంది. ఆ పొరపాటు ఏమిటి? దానికి వారు ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది? ఆ తర్వాత వారి ప్రేమ, జీవితం ఏ తీరానికి చేరాయనేదే మిగతా స్టోరీ.

Thella Kaagitham Movie Review Harsh Roshan Youthful Romantic Drama Has Its Moments Full Details

ప్లస్ పాయింట్లు
ఈ సినిమా ఫస్టాఫ్ మంచి వినోదంతో సాగుతుంది. హీరో, హీరోయిన్ల అమాయకత్వం చుట్టూ అల్లుకున్న కామెడీ సీన్లు చక్కగా పండటంతో నవ్వులు పూయిస్తాయి. యూత్‌ఫుల్ అంశాలు కొన్ని చోట్ల కాస్త డోస్ ఎక్కువైనా, ఎంటర్‌టైన్‌మెంట్ దానిని బ్యాలెన్స్ చేస్తుంది. హర్ష్ రోషన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా.. దీపక్ మాలితో అతని కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి. డెబ్యూ హీరోయిన్ నక్షత్ర మొదటి సినిమాలోనే చాలా కాన్ఫిడెంట్ గా నటించి మెప్పించింది. హీరోయిన్ తండ్రి పాత్రలో అజయ్ సీనియర్ నటుడిగా తన మార్క్ చూపించారు.

మైనస్ పాయింట్లు
ప్రస్తుతం వస్తున్న యూత్ ఫుల్ సినిమాల తరహాలోనే ఇది కూడా పాత ఫార్ములాకే పరిమితమైంది. చెడు సావాసాలు, యువత చేసే పొరపాట్ల చుట్టూ సాగే కథనం సెకండాఫ్‌లో చాలా ప్రిడిక్టబుల్‌గా మారుతుంది. స్టోరీలో వేగం తగ్గడం, సాగదీసినట్లు ఉండే సన్నివేశాలు ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. కొన్ని అనవసర సీన్లను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో హీరో సోదరుడు, అజయ్ మధ్య వచ్చే డైలాగ్స్ బాగున్నప్పటికీ.. దానికి దారితీసే సీన్లు అంత ఎఫెక్టివ్ గా లేవు. అలాగే కొన్ని సీన్లు ఫ్యామిలీ అభిమానులకు మింగుడుపడవు.

అల్లు అర్జున్ 'రాకా' నుంచి అద్దిరిపోయే అప్డేట్.. ఇదే కానీ నిజమైతే..!
అల్లు అర్జున్ 'రాకా' నుంచి అద్దిరిపోయే అప్డేట్.. ఇదే కానీ నిజమైతే..!

సాంకేతిక విభాగాలు
విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు చాలా మధురంగా ఉండి ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సీన్లను బాగా ఎలివేట్ చేసింది. కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ చిన్నపాటి పట్టణ వాతావరణాన్ని చాలా చక్కగా కెమెరాలో బంధించింది. నందు సవారిగాన అందించిన కథ, స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల మాత్రమే మెప్పిస్తాయి. క్లైమాక్స్ సందేశాత్మకంగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ ను ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్‌గా..
మొత్తంగా చెప్పాలంటే.. 'తెల్లకాగితం' అక్కడక్కడా మెప్పించే ఓ యావరేజ్ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా. యూత్‌ఫుల్ లవ్ స్టోరీలను ఇష్టపడేవారు ఎటువంటి భారీ అంచనాలు లేకుండా ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+