అన్నా వస్తాడు.. హిట్టు కొట్టి పోతాడు.. రిపీటు..!
హాలీవుడ్ దర్శకుల గురించి మాట్లాడితే అందరికీ ముందుగా జేమ్స్ కేమరాన్, క్రిష్టోఫర్ నోలన్ గుర్తుకువస్తారు. నోలన్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు సాధారణంగా ఉండవు. సైన్స్ ల్యాబ్ లో ప్రయోగాలు చేసినట్లు క్రిష్టోఫర్ నోలన్ సినిమాలు చేస్తుంటారు. నోలన్ సినిమాల్లో ఎక్కువగా సైన్స్, ఫిజిక్స్, భావోద్వేగాలు, థ్రిల్లింగ్ అంశాలు కనిపిస్తుంటాయి. ఇప్పటి వరకూ 12 సినిమాలు మాత్రమే తీసిన నోలన్.. ఒక్కో సినిమాను ఒక్కో డైమండ్ గా మలిచారు. ఆయన ఒక్కో సినిమా ముందు తరాలకు ఒక్కో లైబ్రరీ అని చెప్పొచ్చు.
1998 లో తొలిసారిగా ఫాలోయింగ్ అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు నోలన్. ఆ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. ఆ తర్వాత 2000 లో మొమెంటో సినిమా ఇప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పొచ్చు. ఆ తర్వాత బ్యాట్ మాన్, ది ప్రెస్టేజ్, డార్క్ నైట్, ది డార్క్ నైట్ రైజెస్, ఇంటర్ స్టెల్లార్, డంకిర్క్, టెనెట్, ఒప్పెన్ హైమర్ సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ది ఒడిస్సీ మూవీతో జూలై 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
ది ఒడిస్సీ మూవీకి ప్రపంచవ్యాప్తంగా భారీగా క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రీమియర్స్ పడగా బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తోంది. భారత్ తో పాటు అనేక దేశాల్లో జూలై 17న విడుదలకు సిద్ధం అవుతోంది. హైదరాబాద్ లో ఇప్పటికే బుకింగ్స్ లో జోరు కొనసాగుతోంది. బుక్ మై షో లో మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ మూవీ తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. మరి ఈ మూవీలో ఏముంది..?

హోమర్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ట్రోజన్ వార్ పదేళ్లపాటు కొనసాగిన తర్వాత కింగ్ ఒడిస్సియస్ తన భార్యా కొడుకును కలుసుకోవడం కోసం తిరుగు ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. కానీ అతని సముద్ర ప్రయాణం చాలా భీకరంగా ఉంటుంది. ఊహించని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. మరోవైపు తండ్రిని వెతుక్కుంటూ కుమారుడు కూడా వస్తాడు. ఈ స్టోరీనే ఒడిస్సీ అని స్పష్టం అవుతోంది. ఇక ఈ మూవీ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే విధానంలో కొనసాగుతుందని హాలీవుడ్ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ తరహా స్క్రీన్ ప్లే చాలా కష్టంగా ఉంటుంది. మరి ప్రేక్షకులకు అర్థమయ్యేలా నోలన్ ఎలా చెప్పారనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications