'ది ప్యారడైజ్' మూవీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధరలు పెంపు..
నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' మూవీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24 న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దాంతో రిలీజ్ కు ఒక్క రోజు ముందే అంటే సెప్టెంబర్ 23 న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు 'ది ప్యారడైజ్' మూవీ ఫస్ట్ ప్రీమియర్ పడనుంది. అలాగే టికెట్ రేట్లను కూడా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. పెంచిన టికెట్ ధరలకు సంబంధించిన వివరాలు చూస్తే సెప్టెంబర్ 23 న ప్రీమియర్ షోకు సింగిల్ స్క్రీన్ టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 500 గా నిర్ణయించింది. అటు మల్టీప్లెక్స్ లోనూ రూ. 500 గా నిర్ణయించింది.
ఇక రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 27 వరకు టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ. 48 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ. 23 వరకు పెంచుకునే వీలుంది. ఇక మల్టీప్లెక్స్ లో అయితే సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 27 వరకు టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ. 94 వరకు పెంచుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ. 45 వరకు పెంచుకోవచ్చు. అలాగే రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే ఇందుకు బదులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకు ప్యారడైజ్ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ సంస్థ రూ. కోటి అందజేసింది.

ఇక నాని ప్యారడైజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21 సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. ఇక ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్, ఏషనాగుల పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాపై విపరీతమైన పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ప్యారడైజ్ మూవీని ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి విడుదల చేయనుంది చిత్ర యూనిట్. మరి ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఇంకెన్ని రికార్డుల్ని నమోదు చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications
