The Paradise Critic Review: 'ది ప్యారడైజ్' మూవీ క్రిటిక్ రివ్యూ ఇదే..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ది ప్యారడైజ్' మూవీ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నైజాంలో టికెట్ ముక్క దొరకడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మామూలుగా లేదు. రిలీజ్ కు ముందే బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ లేనంత బజ్ నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీకి దక్కడం విశేషం. ఓ చిన్న టీజర్, రెండు పాటలు మినహా కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. అయినా ఈ మూవీకి ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ కావడం చూస్తుంటే నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల- నాని కాంబోలో ఇదివరకు వచ్చిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. వరంగల్ కు చెందిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కు తెలంగాణపై ఎంత పట్టు ఉందో ఈ సినిమా చూపించింది. ఇప్పుడు ప్యారడైజ్ మూవీలో కూడా తెలంగాణలోని సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ గా సినిమా ఉండనున్న నేపథ్యంలో రిలీజ్ కు ముందే ఈ మూవీపై భారీగా హైప్ క్రియేట్ అయింది.

ఇక ఇప్పటికే ప్యారడైజ్ మూవీ నుంచి రిలీజ్ అయిన ఆయా షేర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతటి బీభత్సం సృష్టించిందో మనకు తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించేది. ఈ ఒక్క పాటలోనే ప్యారడైజ్ మూవీ స్టోరీ ఏంటో చెప్పకనే చెప్పాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. తమ జాతిని, తమ అస్థిత్వాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న ఓ మాలిక్ పై జరిపిన తిరుగుబాటే ఈ మూవీ అని తెలుస్తోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఏషనాగుల పాట కూడా బ్లాక్ బస్టర్ అయింది. పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్ కావడంతో జనాలకు ఈజీగా ఎక్కింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏషనాగుల పాటే వినిపిస్తోంది. ఈ రెండు పాటలతోనే సినిమా హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక అనిరుధ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాని- శ్రీకాంత్ ఓదెల- అనిరుధ్ ఈ ముగ్గురు స్క్రీన్ పై చేసిన మ్యాజిక్ ప్యారడైజ్ మూవీ అని క్లియర్ గా తెలుస్తోంది.

theparadise review for the film has seen blockbuster pre booking sales premieres begin this evening

ప్యారడైజ్ మూవీకి తాజాగా సెన్సార్ బృందం ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 54 నిమిషాలుగా ఉంది. అంటే దాదాపు 3 గంటల పాటు మెంటల్ మ్యాడ్ నెస్ అని చెప్పొచ్చు. ఇక ఇవాళ సాయంత్రం నుంచే బాక్సాఫీస్ వద్ద జడల్ గాడి జమానా షురూ కానుంది. సెప్టెంబర్ 24 అంటే రేపటి నుంచి థియేటర్ల వద్ద ప్యారడైజ్ జాతర స్టార్ట్ కానుంది. ప్యారడైజ్ మూవీకి సంబంధించిన క్రిటిక్ రివ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫస్టాఫ్ లో జైలు ఫైట్ అద్దిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత ఇంటర్వెల్ ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇక సెకండాఫ్ లో మధర్ సెంటిమెంట్ తో దర్శకుడు శ్రీకాంత్ ఏడిపించాడని.. అలాగే ప్రీ క్లైమాక్స్ చాలా ఇంటెన్స్‌ గా ఉంటుందని సమాచారం. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ఎవరూ ఊహించని విధంగా వయలెంట్‌ గా ఉంటుందని.. చివరగా మరోసారి మధర్ సెంటిమెంట్ లో ఎమోషనల్ హై తో థియేటర్ నుంచి బయటకు వస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+