The Paradise Movie First Review: నాని 'ది ప్యారడైజ్' మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!
నేచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల కాంబో అనగానే 'దసరా' మూవీ గుర్తుకొస్తుంది. 2023లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నాని కెరీర్ లో స్పెషల్ సినిమాగా నిలిచింది. రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో నాని అదరగొట్టారు. ఇక దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల కు ఇదే ఫస్ట్ సినిమా. అయినా ఎక్కడా తడబడకుండా సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ది ప్యారడైజ్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఆయా షేర్, ఏషనాగుల పాటలు ఎక్కడపడితే అక్కడ వినిపిస్తున్నాయి. ఇక ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓవర్సీస్ లో రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. క్షణాల్లోనే హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడయ్యాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఇక ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో హీరో నాని మాట్లాడుతూ.. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయడం లేదని బాంబ్ పేల్చారు. అంటే ట్రైలర్ లేకుండా డైరెక్ట్ గా థియేటర్లలోనే ప్రేక్షకులకు పిచ్చెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఓ పెద్ద సినిమా ఇటీవలి కాలంలో ట్రైలర్ లేకుండానే రిలీజ్ కావడం బహుశా ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి ప్రస్తుతం ఉన్న బజ్ కు ట్రైలర్ అవసరం లేదని మరో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నాని- శ్రీకాంత్ ఓదెల కాంబో, పక్కా హైదరాబాదీ స్టైల్ సినిమా, పాటలు, అనిరుధ్ బీజీఎం ఇలాంటి స్పెషల్స్ మరెన్నో సినిమాలో ఉన్నప్పుడు ట్రైలర్ తో పని ఏముందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్యారడైజ్ మూవీకి కచ్చితంగా ఏ సర్టిఫికెట్ వస్తుందని హీరో నానినే డైరెక్ట్ హింట్ ఇచ్చారు. తాము సినిమా ఎలా తీసినా ఏ సర్టిఫికెట్ ఇస్తారని పంచ్ వేశారు. ఇక సినిమాలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయిందని.. తల్లి కొడుకు మధ్య జరిగే ఎమోషనల్, రివల్యూషనరీ కథాంశమే తమ సినిమా అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పారు. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం నెట్టింట ఓ బజ్ నడుస్తోంది. ఈ మూవీని తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ చూసినట్లు సమాచారం. అయితే వీళ్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్ అని.. సెకండాఫ్ యావరేజ్ అని నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే మొత్తానికి దసరా రేంజ్ లో నాని- శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమాతోనూ మ్యాజిక్ చేసినట్లు సమాచారం. నాని కెరీర్ లో మరి సూపర్ హిట్ అని తెలుస్తోంది. ఇక ఫుల్ రివ్యూ కావాలంటే సెప్టెంబర్ 24 వరకు ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications
