Ameer Khan: బాలీవుడ్‍కు షాక్.. చెన్నైకి షిఫ్ట్ కానున్న అమీర్ ఖాన్..!

ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఖాన్ త్రయం.. ఖాన్ త్రయం అంటే బాలీవుడ్. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఖాన్ త్రయంలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఉన్నారు. వీరిలో అమీర్ ఖాన్ గత రెండు, మూడేళ్లుగా సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ అమీర్ ఖాన్ ఫ్యాన్ ఫాలోవింగ్ ఏ మాత్రం తగ్గలేదు. భారత అభిమానుల్లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా చెరగని ముద్ర అమీర్ ఖాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అమీర్ ముంబై నుంచి షిఫ్ట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అమీర్ ఖాన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఆయన ముంబై నుంచి మరో నగరానికి వెళ్తున్నట్లు ముంబైలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటలు అందరు ముంబైలోనే ఉంటారు. అలాంటి ముంబైని విడిచిపెట్టి
అమీర్ ఖాన్ మరో నగరానికి వెళ్తున్నరన్న వార్త ఆయన నఅభిమానుల్లో కలవరం మొదలైంది. అయితే అమీర్ ఖాన్ దక్షిణాది నగరమైన చెన్నైకి షిఫ్ట్ కావాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమీర్ ఖాన్ చెన్నైకి మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమీర్ ఖాన్ ముంబైని విడిచిపెట్టి చెన్నైకి ఎందుకు వెళ్తున్నాడని అభిమానులకు అంతుపట్టడం లేదు.

There are reports that Bollywood hero Aamir Khan is shifting from Mumbai to Chennai

అయితే అమీర్ ఖాన్ ముంబై వీడడానికి ముఖ్యమైన రీజనే ఉందట. అమీర్ ఖాన్ తల్లి గత కొంత కాలంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లికి తోడుగా ఉండేందుకు అమీర్ ఖాన్ చెన్నైకి మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అమీర్ ఖాన్ పర్మినెంట్ చెన్నైలో ఉండడట.. కొన్ని నెలలు మాత్రమే చెన్నైలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తల్లి కోసం అమీర్ ఖాన్ చెన్నైకి షిఫ్ట్ కావడం పట్ల ఆయన అభిమానాలు అమీర్ ఖాన్ ను అభినందిస్తున్నారు. తల్లి పై అమీర్ చూపుతున్న ప్రేమను కొనియాడుతున్నారు.

అమీర్ ఖాన్ నటించిన రాజా హిందుస్థానీ, లగాన్, ధూమ్ 3, గజిని, పీకే, త్రి ఇడియట్స్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. అమీర్ ఖాన్ అసలు పేరు మహమద్ ఆమిర్ హుస్సేన్ ఖాన్. ఆయన నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. అమీర్ ప్రస్తుతం హిట్లు లేక ఇబ్బంది పడుతోన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+