ఈ 6 బోల్డ్ సినిమాలు రాత్రికి రాత్రే నిషేధం.. నేటికీ వివాదాస్పదమే!
బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు వాటి కంటెంట్, కథనం లేదా సన్నివేశాల కారణంగా ప్రేక్షకుల ముందుకు రాకుండానే నిలిచిపోయాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సెన్సార్ బోర్డు ఒక సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే అది కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. అయితే కొన్ని సినిమాలు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించి చివరకు నిషేధించబడ్డాయి లేదా విడుదలకు అడ్డంకులు ఎదుర్కొన్నాయి. ఈ సినిమాలలో మతపరమైన భావాలను కించపరచడం, హింస, బోల్డ్ సన్నివేశాలను బహిరంగంగా చూపించడం వంటి సమస్యలు ఉండడంతో వాటిని ఇండియాలో నిషేధించారు. అలాంటి కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.
1. బాండిట్ క్వీన్ (Bandit Queen)
1994లో వచ్చిన ఈ సినిమా పూలన్ దేవి జీవితం ఆధారంగా తెరకెక్కింది. దీనికి శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన అనేక సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కంటెంట్ ప్రేక్షకులకు చూపించడం సరికాదని భావించి ఈ సినిమాను నిషేధించారు.

2. ఉర్ఫ్ ప్రొఫెసర్(Urf Professor)
ఈ సినిమా హాస్యం, నేరం, బోల్డ్ కంటెంట్ కలగలిపి ఉంది. మనోజ్ పహ్వా, అంతరా మాలి, శర్మన్ జోషి వంటి నటీనటులు నటించిన ఈ చిత్రం అధికంగా అసభ్యకరమైన, బోల్డ్ సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు దృష్టిలో పడింది. ఈ కారణాలతో దీని విడుదల నిలిపివేయబడింది.
3.ద పింక్ మిర్రర్(The Pink Mirror)
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు "అశ్లీలమైనది, అభ్యంతరకరమైనది" అని పేర్కొని నిషేధించింది. ఈ సినిమాలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్ మహిళలు, ఒక గే టీనేజర్ ఒక పురుషుడిని ఆకర్షించడానికి ప్రయత్నించే కథ ఉంది. ఈ అంశం భారతీయ సాంప్రదాయ ప్రేక్షకులకు నచ్చదని భావించి, దీని విడుదల నిలిపివేయబడింది.
4. పాంచ్ (Paanch)
అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 'పాంచ్' సినిమా 2003లో సెన్సార్ బోర్డు కత్తి వేటుకు గురైంది. ఇది 1976-77లో పూణేలో జరిగిన జోషి-అభ్యంకర్ సీరియల్ మర్డర్ కేసు ఆధారంగా రూపొందించబడిందని చెబుతారు. ఇందులో డ్రగ్స్, తీవ్రమైన హింస, బూతులు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా విడుదల కాలేదు.
5.బ్లాక్ ఫ్రైడే(Black Friday)
2004లో విడుదల కావాల్సిన 'బ్లాక్ ఫ్రైడే' సినిమా 1993 ముంబై బాంబు పేలుళ్లు కథనం ఆధారంగా నిర్మించబడింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించారు. కానీ చట్టపరమైన అడ్డుంకుల ఆధారంగా దీని విడుదల నిలిచిపోయింది.
6. అన్‌ఫ్రీడం (Unfreedom)
ఈ థ్రిల్లర్ చిత్రంలో ఒక లెస్బియన్ జంట, ఇస్లామిక్ ఉగ్రవాదానికి సంబంధించిన బోల్డ్ కథనం ఉంది. ఇందులో నగ్న సన్నివేశాలు ఎక్కువగా ఉన్న కారణంగా సెన్సార్ బోర్డు ఈ సినిమాను నిషేధించింది. ఈ సినిమాలు భారతీయ సినీ పరిశ్రమలో సెన్సార్ బోర్డు ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో, ముఖ్యంగా మతపరమైన, రాజకీయ, లైంగిక అంశాలు ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తాయి.
-
7.5 గంటల సినిమా? ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications