తారుమారైన సెలబ్రిటీల జీవితాలు
2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అలాగే 2024లో కొందరు సెలబ్రిటీలు వార్తల్లో నిలిచి సంచలనం సృష్టించారు.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు వినిపించాయి. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేయడం జరిగింది. హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ లావణ్య పోలీస్ స్టేషన్ మెట్టులెక్కింది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. అటు రాజ్ తరుణ్ సైతం ఆమెతో తాను శారీరక సంబంధం పెట్టుకున్న మాట వాస్తవమే అని తెలిపారు.

ఇక ఇదే ఏడాది మాస్టర్ జానీ జీవితం కూడా తలక్రిందులైంది. కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
తన దగ్గర పని చేసే అస్టిస్టెంట్‌పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు అందడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా జానీ మాస్టర్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అస్టిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ పోలీసుల ఫిర్యాదు చేసింది. ఈ కేసులో జానీ మాస్టర్ కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు.
ఇక ఈ ఏడాదే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా నమోదైంది. రాంగోపాల్ వర్మ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ కార్యకర్తలు ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి, ఆయన్ను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
ఇక ఏడాది చివర్లో మంచు ఫ్యామిలీ సైతం పోలీస్ స్టేషన్ చూట్టు తిరుగుతోంది. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.దీంతో మంచు మనోజ్‌పైన ఆయన భార్య మౌనికపైన పోలీసులు కేసు నమోదు చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications