ఇప్పటికీ ఒంటరి జీవితం గడుపుతున్న హీరోయిన్లు
సినీ పరిశ్రమ అన్న తర్వాత హీరోలే ఎక్కువ కాలం ఆధిపత్యం చలాయిస్తుంటారు. యవ్వనంలో అడుగుపెట్టి వృద్ధాప్యం వరకు నటిస్తూనే ఉంటారు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు. కొంతకాలం మాత్రమే వీరు తమ హవాను కొనసాగిస్తారు. ప్రకృతి సహజంగా వీరికి వయసు పెరుగుతుండటంతో పెద్దరికం వస్తుండటంతో తల్లి, వదిన, ఆ తర్వాత అమ్మమ్మ, నానమ్మ పాత్రలకు పరిమితమవుతుంటారు. భారతీయ సినీ పరిశ్రమలో 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఒకసారి వారి వివరాలు తెలుసుకుందాం.
అమీషా పటేల్
హిందీలో నటిస్తున్నప్పటికీ తెలుగులో అవకాశం రావడంతో ఇక్కడ కూడా నటించింది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. క్రమేపీ సినిమాల్లో అవకాశం రావడం తగ్గుముఖం పట్టాయి. 50 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్న ఈ బ్యూటీ ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తోంది.

శోభన
చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా రాణించింది. మళయాళంలో ఓ హీరోతో జంటగా 50 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది. స్వతహాగా భరతనాట్యం వచ్చు. ఇప్పటికీ నృత్య ప్రదర్శనలు ఇస్తుంటుంది. 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ వివాహం చేసుకోలేదు.
నగ్మా
తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, భోజ్ పురి, ఒరియా భాషల్లో సినిమాలు చేసి కొన్ని సంవత్సరాలపాటు తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమలో పడిందికానీ వివాహం వరకు వెళ్లలేదు. నగ్మా 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఒంటరిగానే ఉండటానికి కారణం ఈ ప్రేమే అని కొందరు అంటుంటారు.
టబు
నిన్నే పెళ్ళాడుతా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయింది. ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడింది. అప్పటికే అతనికి పెళ్లి కావడంతో ఇలా 50 ఏళ్ల వయసులో ఒంటరిగా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications