ఒంటరిగా మిగిలిపోయిన హీరోయిన్లు వీరే
సినిమా పరిశ్రమలో హీరోయిన్లు కొంతకాలం మాత్రమే తమ హవాని కొనసాగిస్తుంటారు. హీరోల్లా దీర్ఘకాలం కొనసాగలేరు. కొంతమంది హీరోయిన్లు సక్సెస్ సాధించిన తర్వాత కెరియర్ ని మలుచుకుంటారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం 50 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నప్పటికీ ఇంకా కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. వారి వివరాలు తెలుసుకుందాం.
టబు
నిన్నే పెళ్ళాడుతా సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత చాలా స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటోంది. ఒక హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిందని చాలామంది అంటుంటారు.

నగ్మా
స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉండి కూడా పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండానే కెరీర్ ను కొనసాగిస్తోంది. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమలో పడిందంటారు. ప్రస్తుతం వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడానికి కూడా ఈ ప్రేమే కారణమని చెబుతుంటారు.

శోభన
చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తోంది. శోభన పెళ్లి చేసుకోబోతోందంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అయితే వాటిల్లో ఏ మాత్రం నిజం లేదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. 50 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అమీషా పటేల్
బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా నటించింది. పవన్ కళ్యాణ్ తో బద్రి,మహేష్ బాబుతో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి సినిమాలు చేసింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. 50 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతోంది.












Click it and Unblock the Notifications