కల్కి సినిమాపై హీరో మహేష్‌బాబు కామెంట్ ఇదే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా రీలీజయిన కొద్దిరోజుల్లోనే రికార్డుల సునామి సృష్టిస్తోంది. ఈ సైన్ ఫిక్షన్ సినిమా విడుదలయిన పదకొండు రోజుల్లోనే రూ. 900కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషనల్‌గా మారింది. ఇప్పడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక, ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం గురించి చాలామంది ప్రముఖులు, సినీ నిర్మాతలు, సినీ హీరోలు ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా టాలీవుడ్ నటుడు ప్రిన్స్ మహేష్‌బాబు ఈ సినిమాపై తనదైన పద్ధతిలో స్పందించారు. కల్కి సినిమా అద్భుతంగా ఉందని, ఈ సినిమా చూసి తన మతిపోయిందని మహేష్‌బాబు సోషల్‌మీడియాలో తన ఖాతా వేదికగా మూవీ యూనిట్‌ను ప్రశంసించారు.
ఇంతకీ మహేష్‌బాబు ఏమన్నారో.. ఆయన మాటల్లోనే విందాం.. కల్కి సినిమా చూసి మతిపోయింది. ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం నా మనసును కదిలించింది. జస్ట్ వావ్!. నాగ్ అశ్విన్ విజన్‌కు హ్యాట్సాఫ్. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రజెన్స్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేని విధంగా ఉంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి కూడా రాశారు. కమల్‌హాసన్ ఏ పాత్ర పోషించినా దానికంటూ ఓ ప్రత్యేకత తీసుకువస్తారు. డార్లింగ్ ప్రభాస్ మరో గొప్ప సినిమాను ఎంతో అవలీలగా చేసేశారు. నటి దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. వైజయంతి సంస్థకి, చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ అంటూ మహేశ్ బాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

స్పందించిన చిత్ర యూనిట్..
మహేశ్ బాబు పోస్ట్ చేసిన ట్వీట్‌కు కల్కి చిత్ర యూనిట్ వెంటనే స్పందించింది."మైండ్ బ్లాక్ అయిపోయింది. మీ ప్రశంసలకు మా ధన్యవాదాలు. హృదయాన్ని పరిగెత్తించే మాటలను చెప్పారు" అంటూ కల్కి టీమ్ రిట్వీట్ చేసింది. సైన్స్ ఫిక్షన్ మూవీగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ' బ్లాక్‌బస్టర్ హిట్‌ను సంపాదించుకుంది. గత నెల 27వ తేదిన విడుదలైన ఈ సినిమా తక్కువ సమయంలోనే రికార్డులను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ. 1000కోట్ల వైపు పరుగులు తీస్తోంది.












Click it and Unblock the Notifications