ఈ ఏడాది అతి పెద్ద ఫ్లాప్ సినిమా ఇదే..ఫ్యాన్స్ ఎలా జీర్ణించుకుంటారో..!
ఇటీవల కాలంలో సినిమా స్థాయి పెరిగింది. ఇండియన్ సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కంటెంట్ లేకపోయినప్పటికీ భారీగా నిర్మించి చేతులు కాల్చుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడి, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే, బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బడే మియా చోటే మియా' సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఈ సినిమాలను మించి మరో సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్'.

తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి అతిపెద్ద పండగ. ఈ పండగకు రిలీజయ్యే ఏ సినిమా అయినా మినిమమ్ గ్యారెంటీ హిట్ అవుతుందని పేరుంది. అయితే ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్', గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిల్లో 'డాకు మహారాజ్','సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'గేమ్ ఛేంజర్' మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌గా నిలిచింది.
మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు చెప్పారంటే సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. సినిమాపై సగటు ప్రేక్షకులతో పాటు, మెగా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలిసిన కథే అయినప్పటికీ, కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. ముఖ్యంగా సెకండాఫ్ అభిమానుల సహానానికి పెద్ద పరీక్షే అని చెప్పాలి.
దీని ఫలితంగానే "గేమ్ ఛేంజర్" బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవి చూసింది.రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్'ను నిర్మించారు. కలెక్షన్లు మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఈ సినిమా సుమారు 128 కోట్ల నుండి 131 కోట్ల రూపాయల వరకు మాత్రమే వసూలు చేసింది. దీంతో, నిర్మాతలకు 370 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లుగా వార్తలు వచ్చాయి.కొన్ని నివేదికలు నిర్మాత దిల్ రాజుకు 100 కోట్ల వరకు నష్టం వచ్చిందని కూడా పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో అతి పెద్ద ఫ్లాప్ సినిమాగా గేమ్ ఛేంజర్ నిలిచింది. "గేమ్ ఛేంజర్" బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచి, నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.












Click it and Unblock the Notifications