రూ.వేల కోట్ల ఆస్తి ఉన్నా సంతోషానికి దూరమైన అక్కినేని అమల?
అక్కినేని అమల. ఒకప్పుడు సినిమాల్లో కథానాయిక కాగా ఆ తర్వాత బ్లూక్రాస్ ద్వారా ప్రజలందరికీ చిరపరిచితమయ్యారు. మూగజీవాలను రక్షించడం, వాటికి ఆహారం, చికిత్స తదితరాల కోసం కొన్ని దశాబ్దాల నుంచి ఆమె కృషిచేస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో డబ్బున్నప్పటికీ సంతోషాన్ని ఆస్వాదించలేని సందర్భాలు ఎదురవుతుంటాయి. తాజాగా అక్కినేని అమల కూడా అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఉన్న అమల ఆ తర్వాత అక్కినేని అమలగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్ని రూ. వేల కోట్ల ఆస్తి ఉందో అందరికీ తెలిసిన విషయమే. అక్కినేని అమల ఎక్కడికి వచ్చినా సరే చాలా సింపుల్ లుక్స్ లో మెరుస్తుంది. అది ఆమె స్టైల్ అని .. చాలామంది భావిస్తారు. కానీ ఆమెకి బంగారం వేసుకుంటే ఎలర్జీ వస్తుందట .. చర్మంపై రాషెస్ వచ్చేస్తాయి.. స్కిన్ మొత్తం రెడ్డిష్ గా మారిపోతుందట.

ఈ ఒక్క కారణంతోనే అమల బంగారానికి దూరమైంది అని అక్కినేని కుటుంబ సభ్యుల చెప్పుకొస్తున్నారు. అంతేకాదు అమలకి మొదటి నుంచి బంగారం అంటే చాలా చాలా ఇష్టం. ఎక్కువగా చేతికి పెట్టుకునే ఉంగరాలను ఇష్టపడుతుందట . అయితే ఒక ఏజ్ వచ్చాక అక్కినేని అమలకు గోల్డ్ ధరిస్తే రాషెస్ రావడం జరుగుతోంది. ఈ జబ్బు ఎవరికో వేలల్లో లక్షల్లో ఒకరికే ఉంటుంది. అలాంటి చిన్న డిసీజ్ వల్లే ఆమె బంగారానికి దూరమయ్యారు.
అక్కినేని నాగార్జున- అమల కుమారుడు అక్కినేని అఖిల్ తాజా చిత్రం ఏజంట్ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో తర్వాత చేయాల్సిన సినిమా ఏమిటనే విషయమై అక్కినేని కుటుంబం మల్లగుల్లాలు పడుతోంది. చేయబోయే చిత్రానికి దర్శకుడు రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో సహాయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications