నటి పూజా హెగ్దేకు చంపేస్తామంటూ బెదిరింపులు...ఇందులో నిజమెంత..?
టాలీవుడ్‌లో అలవైకుంఠపురం చిత్రంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది నటి పూజా హేగ్దే.. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకుంది ఈ బుట్టబొమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్సు లేవు. అయితే, పూజా చేతిలో పలు హిందీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పూజా బాలీవుడ్‌లో దేవా అనే సినిమాకు సైన్ చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాలో షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయి. ఇక, ఈ సినిమాను 2024 దసరాకి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు. అయితే, తాజాగా పూజా హెగ్దెకు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. ఈ వార్త కాస్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.
ఓ క్లబ్ ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లారు నటి పూజా హెగ్దే. అయితే, అక్కడ ఆమెకు చంపేస్తామంటూ బెదిరింపులు ఎదురయ్యాయని, దీంతో పూజా వెంటనే ఇండియాకి తిరుగు ప్రయాణమయ్యారని బీ టౌన్ వర్గంలోని ఒక సమాచారం సంస్థ పోస్ట్ చేసింది. అయితే, ఈ వార్త తెలుసుకున్న కొంతమంది అభిమానులు పూజ హేగ్దెకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇండియాకు ఎప్పుడు వస్తారా? అని ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది.

ఈ వార్త కేవలం రూమరేనన్న బీ టౌన్ వర్గాలు : దుబాయ్‌లో క్లబ్ ఓపెనింగ్‌కి వెళ్లిన పూజకి అక్కడ ఒక విషయంలో మరొకరితో గట్టి వాదన జరిగిందట. ఇక ఈ వాదనలో ఎదుటివ్యక్తులు పూజని చంపేస్తామంటూ బెదిరించారట. దీంతో ఆమె అక్కడి నుంచి వెంటనే ఇండియాకి తిరిగి ప్రయాణమయ్యారని బీ టౌన్‌లోని ఓ సమాచార సంస్థ పోస్ట్ చేసింది. అయితే, ఈ విషయం పై నటి పూజా హెగ్డే మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వార్త కేవలం రూమరేనని కొందరు అంటున్నారు. ఈ విషయంపై బీటౌన్ మీడియా నటి పూజటీమ్‌ని సంప్రదించారట. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని వారు చెప్పినట్లు బీటౌన్ వర్గాలు తెలియజేశాయి. అయితే, సోషల్‌మీడియాలో వైరల్ అయిన ఆ పోస్ట్‌ను కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ న్యూస్ కేవలం రూమరే అని తేలిపోయింది. ఈ వార్త విన్న ఆమె అభిమానులు కాస్త ఊరట లభించింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications