నేడు జాతీయ‌ సినిమా దినోత్స‌వం.. ఈ విష‌యాలు తెలుసా...?

మన దేశంలో రెండే రెండు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లు ప్ర‌జ‌ల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తున్నాయి. అందులో మొద‌టిది క్రికెట్‌. రెండోది సినిమా..ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించండంలో సినిమా చాలా కీల‌క పాత్ర పోషిస్తుంది. నేడు అక్టోబ‌ర్ 13. నేడు జాతీయ‌ సినిమా దినోత్సవం. ఈ సంద‌ర్బంగా సినిమా గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలుసుకుందాం.

సినిమా ఓ దృశ్య మాధ్య‌మం : సినిమా అనేది కథను చెప్పడంలో సహాయపడే దృశ్య మాధ్యమం. అనేక సంవత్సరాలుగా సినిమా అనేది అత్యధిక జనాభాపై భారీ ప్రభావాన్ని చూపింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమా లేకుండా జీవితాలను ఊహించుకోలేము. సినిమా కూడా ప్రతి ఒక్కరి జీవితంలోని వాస్తవికతను చూపుతుంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటనలను థియేటర్లలో సినిమాగా చూపించేందుకు మళ్లీ స్క్రిప్ట్‌ని రూపొందించి చిత్రీకరిస్తారు. సినిమాలో ఉన్న మంచి, చెడు రెండూ సమాజంపై భారీ ప్రభావాన్ని చూపెడుతున్నాయి.

Today is National Cinema Day.. Do you know these things...?

30 యేళ్ల పాటు సౌండ్ లేకుండా సినిమా : సినిమా అనేది అతి పెద్ద మాధ్యమం. 1895లో ఫ్రాన్స్‌లోని లూమిరె సోద‌రులు ఒక సూట్‌కేసు సైజులో ఉన్న సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని తయారు చేశారు. బ్రిట్‌పాల్ అనే పరిశోధకుడు అదేయేడాది యూరోప్‌లో ఒక ఫిల్మ్ ప్రొజెక్టరు కనిపెట్టాడు. 1894లో థామస్ ఎడిసన్ "కైనెటో గ్రాఫ్"ను క‌నిపెట్టాడు. కైనెటో గ్రాఫ్ అంటే కెమెరా అని అర్థం. ఆ త‌ర్వాత అదే ఏడాది థామ‌స్ ఎడిస‌న్ మ‌రో ప‌రిక‌రాన్నిక‌నిపెట్టాడు. దానిపేరు "కైనెటోస్కోప్". దీని అర్థం ప్రొజెక్టర్. ఈ రెండు పరికరాలను కనిపెట్టాడు థామ‌స్‌.

ఆ త‌ర్వాత 1895లో లూమిరె సోద‌రులు అంటే లూమిరె, లూయిస్ లూమిరె వీరిద్ద‌రూ కలిసి సూట్‌కేసు సైజులో ఉన్న సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని తయారు చేశారు. ఈ ప‌రిక‌రం స‌హాయంతోనే క‌దిలే బొమ్మ‌ల‌ను సృష్టించారు. ఈ క‌దిలే బొమ్మ‌ల‌ను చూపించేందుకు వారు అప్ప‌ట్లో డ‌బ్బూలు కూడా వ‌సూలు చేసేవార‌ట‌. ఆ తర్వాత ఎన్నో మార్పులు చేర్పులతో సినిమా అనేది అభివృద్ధి అయ్యింది. మొద‌ట్లో సినిమాకు సౌండ్ ఉండేది కాదు. సౌండ్ లేకుండా కేవలం బొమ్మలతోనే సినిమాను సృష్టించారు. ఆ తర్వాత సౌండ్‌ను కనిపెట్టారు. సుమారు ముప్ప‌యేళ్ల పాటు సౌండ్ లేకుండానే సినిమాల‌ను చూశారు. 1922లో బెర్లిన్‌లో మొదటి సారి సౌండ్ తో కూడిన సినిమాను ప్రదర్శించారు.

Today is National Cinema Day.. Do you know these things...?

1928లో సౌండ్‌తో కూడిన సినిమా : ఆ త‌ర్వాత నుంచి సౌండ్ ఉన్న సినిమాలు జ‌నాల్లోకి వెళ్ల‌డం మొద‌లుపెట్టాయి. మొద‌ట‌గా 1923 నుండి న్యూయార్క్‌లో ప్రేక్షకులు డబ్బులిచ్చి "టాకీ" ను చూడడం మొద‌లుపెట్టారు. ఆతర్వాత సినిమా అనేది జనాల్లోకి వెళ్లడం ప్రారంభ‌మైంది. దీంతో మెల్లగా జనాలు సినిమాను ఆస్వాదించారు. 1928లో పూర్తి సౌండ్ తో కూడిన చిత్రం వచ్చింది. ఆ సినిమా పేరు "ది లైట్స్ ఆఫ్ న్యూయార్క్ ". ఇక తెలుగులో మొద‌టి సినిమా 1931లో వచ్చింది. తెలుగులో వ‌చ్చిన మొట్ట మొదటి సినిమా భక్త ప్రహ్లద.

హిందీలో ఆలం ఆరా అనే సినిమాలు మొద‌టగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఇక ప్ర‌స్తుతం సినిమాలు ఎలా ఉన్నాయో మ‌న‌కు తెలుసు..అప్ప‌ట్లో సినిమాల‌న్నీ బ్లాక్ అండ్ వైట్ క‌ల‌ర్‌లోనే వ‌చ్చేవి. ఆ త‌ర్వాత రెండు రంగుల సినిమాను తీసుకొచ్చారు. అదికూడా 1906లో జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ "కైనెమాకలర్" పేరుతో రంగుల సినిమాను రూపొందించారు. అనంత‌రం మూడు రంగుల సినిమా తెర‌పైకి వ‌చ్చింది. అది 1932లో వ‌చ్చింది. అది కూడా టెక్నిక‌ల‌ర్ అనే పేరుతో తెర‌కెక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+