విడాకుల బాటలో టాలీవుడ్ హీరో శర్వానంద్.. మరి పాప ??
వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజమే. అయితే కారణం చిన్నదైనా కానీ విడపోవడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు నేటి తరం జంటలు. ఇక సినిమా రంగంలో అయితే ఈ తంతు షరా మామూలే. ఏదో ఒక కారణం చెబుతూ సెలబ్రిటీలు విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కొత్తగా పెళ్లైన వారే కాకుండా దశాబ్దాల వివాహ బంధానికి సైతం స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ సైతం ఇదే బాటలో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
కాగా శర్వానంద్ 2023లో రక్షిత రెడ్డి అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి గతేడాది ఓ పాప పుట్టగా లీలావతి అని నామకరణం చేశారు. కానీ ఈ జంట మధ్య కలతలు రేగాయని.. మనస్పర్థలు కాస్తా చినికి చినికి గాలివానలా మారి విడిపోయే వరకు వచ్చిందని అంటున్నారు. అయితే రీసెంట్ గానే వీరికి పాప జన్మించగా.. కొద్దిరోజులు తల్లి దగ్గర, కొద్దిరోజులు తండ్రి దగ్గర ఉండేలా ఒప్పందం కూడా అయ్యిందని టాక్ వినిపిస్తుంది.

అంతకు ముందు కూడా రక్షిత రెడ్డితో శర్వానంద్ విడిపోతున్నారని ప్రచారం మొదలైంది. ఆ సమయంలో కూడా ఆ వార్తలు నిజం కాదని తేలిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి వస్తున్న వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలి అంటే ఎవరో ఒకరు స్పందించే వరకు ఎదురుచూడక తప్పదు.
సినిమాల విషయానికి వస్తే..
శర్వానంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, లక్ష్మీ సహా పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత హీరోగా ప్రస్థానం, గమ్యం వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. 2014లో విడుదలైన రన్ రాజా రన్ ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు వంటి చిత్రాలతో కమర్షియల్ విజయాలను అందుకున్నారు. గత కొంతకాలంగా మాత్రం వరుస ఫ్లాప్ లతో కొంచెం వెనుకపడ్డారు.
శర్వానంద్ ప్రస్తుతం తన 36వ మూవీ #Sharwa36 లో నటిస్తున్నారు. ఈ మూవీలో మోటార్ సైకిల్ రేసర్ గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మిస్తోంది. అలానే శర్వా సరసన మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నాయని సమాచారం.

మరోవైపు రీసెంట్ గానే శర్వానంద్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. "ఓమీ" పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేశారు. మంచి ఉద్దేశాలు, బాధ్యతలతో కూడిన కొత్త చాప్టర్ ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా క్రియేటివిటీ, యూనిటీ, సస్టైనబులిటీ మెయింటైన్ చేస్తూ 100% నాచురల్ స్టోరీస్ ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ప్రారంభించారు.
-
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు?












Click it and Unblock the Notifications