రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న తేజ సజ్జా.. అమ్మాయి ఎవరో తెలుసా?

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆయన ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. పూర్తిగా వ్యక్తిగత వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు.

సినిమా షూటింగ్ టైంలో హీరో, హీరోయిన్లు వాడే దుస్తులను తర్వాత ఏం చేస్తారు?
సినిమా షూటింగ్ టైంలో హీరో, హీరోయిన్లు వాడే దుస్తులను తర్వాత ఏం చేస్తారు?

అమెరికాకు చెందిన అమ్మాయితో.. తరలివచ్చిన ప్రముఖులు
ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. వధువు అమెరికాలో స్థిరపడిన టెక్నాలజీ వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఆమెకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, మాస్ మహారాజా రవితేజ, నటులు శ్రీకాంత్, శివాజీ, నిర్మాత సాహు గారపాటి, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు.

Tollywood Actor Teja Sajja Gets Secretly Engaged in Hyderabad Wedding in Udaipur This December Full Details
యాక్షన్ లేదు.. రక్తపాతం లేదు.. దుల్కర్ కొత్త సినిమా ట్రైలర్‌లో అసలు కథ ఇదే!
యాక్షన్ లేదు.. రక్తపాతం లేదు.. దుల్కర్ కొత్త సినిమా ట్రైలర్‌లో అసలు కథ ఇదే!

డిసెంబర్‌లో ఉదయ్‌పూర్‌లో వివాహం
తేజ సజ్జా వివాహం వచ్చే నెలలో అంటే డిసెంబర్ 2026లో జరగనున్నట్లు సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా అత్యంత సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ మీడియాకు, ప్రచారానికి దూరంగా ఉంచే తేజ సజ్జా.. తన ఎంగేజ్మెంట్‌ను కూడా అంతే నిరాడంబరంగా జరుపుకోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+