లేటు వయసులో పెళ్లిచేసుకున్న టాలీవుడ్ నటుడు..
టాలీవుడ్ నటుడు పెనుమత్స సుబ్బరాజు లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు. సుబ్బరాజు ఒక్క తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. దాదాపు 100 చిత్రాలకు పైగా ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈ నటుడు 47ఏళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యాడు.
నటుడు సుబ్బరాజు పెళ్లి విషయాన్ని స్వయంగా తనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తన భార్యతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలకు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. హిట్చడ్ ఫైనల్లీ అనే క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం నటుడు సుబ్బరాజు షేర్ చేసిన మ్యారేజ్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక, ఈ ఫోటోలను చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, సుబ్బరాజు పెళ్లి సీక్రెట్‌గా, సైలెంట్గా ఎలాంటి హడావిడి లేకుండా జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి వివాహమయినట్లు సమాచారం. సుబ్బరాజు భార్య పేరు, పెళ్లి ఎక్కడ జరిగింది? వంటి వివరాలేవి తెలియరాలేదు.

ఎన్నో చిత్రాలు..
నటుడు సుబ్బరాజు భీమవరానికి చెందినవాడు. ఈయన 'ఖడ్గం' సినిమాలో ఓ చిన్న పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అనంతరం ఆర్య, శ్రీ ఆంజనేయం, నేనున్నాను, సాంబ, భద్ర, పౌర్ణమి, స్టాలిన్, దేశముదురు, అతిథి, తులసి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, బిల్లా, ఖలేజా, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, లీడర్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో కూడా దాదాపు 100 కు పైగా సినిమాల్లో నటించాడు.
-
ఇంటర్నెట్ లేకుండానే "ఇన్స్టాగ్రామ్" రీల్స్ చూడడం ఎలాగంటే..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications